తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. నిలకడగా ఉండడం వరుసగా ఇది రెండో రోజు. వెండి ధర కిలోకు రూ.100 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,700 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,850 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.66,000గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,700 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,850గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,000 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,700 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,850గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,000గా ఉంది.


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో మాత్రం బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,120గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,680 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,680 గా ఉంది.


ప్లాటినం ధర నేడు స్థిరంగా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు రూ.9 పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,290 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.


అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.


Also Read: Multibagger stock: ఐదేళ్లు: ఈ షేరులో లక్షకు రూ.5 లక్షల లాభం!


Also Read: Cryptocurrency Prices Today: రూ.లక్ష కోట్లు పెరిగిన బిట్‌కాయిన్‌ విలువ.. స్తబ్దుగా క్రిప్టో మార్కెట్‌


Also Read: Salary Structure Change: శాశత్వంగా WFH చేస్తున్నారా..! అయితే HRA కట్‌.. పెరగనున్న పన్ను భారం!


Also Read: Digital Payments in 2021: క్రెడిట్‌ కార్డు యూజర్లు కేక! డిజిటల్‌ చెల్లింపుల మీదే రూ.39,000 కోట్లు ఖర్చు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి