శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేస్తున్నారా? మెట్రో నుంచి నాన్‌ మెట్రో నగరానికి మకాం మార్చారా? అయితే మీ యజమాని మీకిచ్చే వేతనంలో హౌజ్‌ రెంట్‌ అలవెన్స్‌ను పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. లేదంటే ఎంతో కొంత కోత వేసేందుకూ ఆస్కారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి వేతన మౌలిక స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు సమాలోచనలు చేస్తోందట!


కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసేందుకు అవకాశం ఇచ్చాయి. ప్రస్తుతం కొన్ని సంస్థలు వారిని ఆఫీసులకు రప్పిస్తున్నాయి. మళ్లీ మళ్లీ వేరియెంట్లు విజృంభిస్తుండటంతో కొన్ని కంపెనీలు శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తున్నాయి. ఉద్యోగులూ దీనిని ఆస్వాదిస్తున్నారు. సరికొత్త పని వాతావరణానికి అనుగుణంగా వేతన స్వరూపాన్ని సవరించాలని ప్రభుత్వం భావిస్తోందట. అటు ఉద్యోగులు, ఇటు యజమానులకు ఇబ్బంది లేని విధంగా మార్పులు చేయాలని అనుకుంటోందని తెలిసింది.


ఇందులో భాగంగా ఉద్యోగి సేవల షరుతులు, వేతనం, ఇతర ఖర్చులను తిరిగి నిర్వచించనున్నారు. ఇంటి నుంచి పనిచేస్తే మౌలిక సదుపాయాలు, కరెంటు, ఇంటర్నెట్‌ ఇతర ఖర్చులను ఇప్పుడు ఉద్యోగే స్వయంగా చెల్లించాల్సి వస్తోంది. వీటిని యజమాని చేత ఇప్పిస్తారని తెలిసింది. అలాగే టైర్-2, టైర్‌-3 నగరాల్లో ఉద్యోగి నివసిస్తే అది ప్రతిబింబించేలా పరిహారం ప్యాకేజీని మారుస్తారు. ముఖ్యంగా హెచ్‌ఆర్‌ఏ పైనే ఎక్కువ ప్రభావం పడనుంది.


ప్రస్తుత నిబంధనల ప్రకారం హెచ్‌ఆర్‌ఏపై పన్ను రిబేట్‌ ఉంటోంది. 1) యజమాని నుంచి పొందిన మొత్తం హెచ్‌ఆర్‌ఏ 2) మెట్రో నగరాల్లో నివసిస్తున్న వారి 50% మూలవేతం + కరవు భత్యం, నాన్‌ మెట్రో నగరాల్లోనైతే 40 శాతం 3) మూల వేతనం + కరవు భత్యంలోని పదిశాతం నుంచి చెల్లించిన ఇంటి అద్దె..  వీటిలో ఏది తక్కువుంటే దానిపై రిబేట్‌ వస్తుంది. ఇప్పుడు హెచ్‌ఆర్‌ఏ తగ్గించి మరో విధంగా పన్ను రిబేట్‌ ఇవ్వకపోతే ఉద్యోగి పైన అధిక పన్నుభారం పడే అవకాశం ఉంది. తగ్గించిన హెచ్‌ఆర్‌ఏను మూల వేతనానికి కలిపితే మాత్రం ఎక్కువ పీఎఫ్‌ లభిస్తుంది. అయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పరిహారం చెల్లిస్తే పన్ను భారం తగ్గుతుంది.


Also Read: Digital Payment Incentive: ఈ డెబిట్‌ కార్డుతో చెల్లింపులు చేస్తే రూ.1300 కోట్ల బహుమతులు.. కేబినెట్‌ ఆమోదం!


Also Read: Multibagger Stocks: 5 ఏళ్లు.. 10 స్టాక్స్‌.. రూ.10 లక్షలు పెట్టుబడి.. రూ.1.7 కోట్ల లాభం


Also Read: RBI Penalty on Banks: ఐసీఐసీఐ, పంజాబ్‌ బ్యాంకులకు ఆర్‌బీఐ షాకు.. భారీ జరిమానా


Also Read: Cars Price Increase: కొత్త సంవత్సరంలో ఈ కార్ల ధరలు పైకి.. ఈ సంవత్సరమే కొనేయండి!


Also Read: Cryptocurrency: భారత్‌లో క్రిప్టో కరెన్సీ నిషేధంపై IMF చీఫ్‌ ఎకానమిస్ట్‌ సంచలన వ్యాఖ్యలు!


Also Read: Health Insurance: తల్లిదండ్రులతో కలిసి ఆరోగ్య బీమా అస్సలు తీసుకోకండి..! ఎందుకంటే..?