టొయోటా కిర్లోస్కర్ మోటార్ కార్ల ధరలను పెంచనుంది. 2022 జనవరి నుంచి కార్ల ధరలు పెంచనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీన్ని బట్టి వచ్చే నెల నుంచి టొయోటా కార్ల ధరలు పెరుగుతాయని అనుకోవచ్చు. గ్లాంజా, అర్బన్ క్రూజర్, ఇన్నోవా క్రిస్టా, ఫార్ట్యూనర్, కామ్రీ, వెల్‌ఫైర్ ఇలా అన్ని కార్ల ధరలూ పెరగనున్నాయి.


2022 జనవరి నుంచే పెరిగిన ధరలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఏయే కార్ల ధరలు ఎంత పెరగనున్నాయో మాత్రం తెలియరాలేదు. పీటీఐ కథనం ప్రకారం.. ఇన్ పుట్ ధరలు, ముడి పదార్థాల ధరలు పెరగడంతో టొయోటా కార్ల ధర పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఈ సంవత్సరం కూడా పండగల సీజన్ ముందు టొయోటా కార్ల ధరలు పెంచిన సంగతి గుర్తు పెట్టుకోవాలి. దీంతో వచ్చే నెల నుంచి మారుతి సుజుకి, టాటా, హోండా కార్లతో పాటు టొయోటా కార్ల ధరలు కూడా పెరగనున్నాయని అర్థం చేసుకోవచ్చు.


స్టీలు, అల్యూమినియం ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్ని కంపెనీలు చెబుతున్నాయి. దీంతోపాటు సెమీకండక్టర్లకు కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ సమస్య అన్ని ఇండస్ట్రీలను వేధిస్తుంది. సెమీకండక్టర్ల విషయంలో డిమాండ్, సప్లై గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది.


ఈ సెమీకండక్టర్ల కొరత 2022 మధ్యలో వరకు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి అప్పటివరకు రేట్ల పెంపుతో పాటు, డెలివరీల్లో ఆలస్యాన్ని కూడా భరించాల్సిందే.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి