కేంద్రప్రభుత్వం గతేడాది పలు చైనా యాప్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై నిషేధాన్ని ఎత్తివేస్తారని ప్రచారం జరుగుతున్న వార్తలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ‘ఆ యాప్స్‌ను బ్లాక్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఉద్దేశం లేదు.’ అని తెలిపారు.


ఈ యాప్స్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తారా అని అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వకంగా జవాబు ఇచ్చారు. పబ్జీ మొబైల్, టిక్‌టాక్, వీబో, వుయ్‌చాట్, అలీ ఎక్స్‌ప్రెస్ సహా ఎన్నో చైనా యాప్స్‌ను కేంద్రప్రభుత్వం మనదేశంలో నిషేధించిన సంగతి తెలిసిందే.


2020 నవంబర్‌లో సెక్షన్ 69ఏ కింద 43 మొబైల్ యాప్స్‌ను బ్లాక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. భారతదేశ సార్వభౌమానికి భంగం కలిగించే వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉన్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. శాంతి, భద్రతల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.


అంతకు ముందు 2020 జూన్ 29వ తేదీన 59 మొబైల్ యాప్స్‌ను, సెప్టెంబర్ 2వ తేదీన మరో 118 మొబైల్ యాప్స్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 69ఏ కింద ఈ నిషేధం విధించినట్లు ప్రభుత్వం తెలిపింది.


అయితే పబ్జీ మొబైల్‌ను మాత్రం బీజీఎంఐ పేరిట తిరిగి తీసుకువచ్చారు. తర్వాత పబ్జీ: న్యూ స్టేట్ అనే కొత్త గేమ్ కూడా తీసుకువచ్చారు


Also Read: Jio 1 Rs Recharge Plan: రూ.1కే జియో రీచార్జ్ ప్లాన్.. లాభాలు ఏంటంటే?


Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి