అమరావతి రైతుల బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవంబర్ 1న గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. 17న తిరుపతిలో బహిరంగ సభతో ముగుస్తుంది. యాత్ర ముగింపు రోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ అనుమతి ఇవ్వకపోవడంతో అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు.


బహిరంగ సభకు సంబధించి.. హైకోర్టులో వాదనలు జరిగాయి. మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా జేఏసీ బహిరంగ సభకు అనుమతించాలని రైతుల తరఫున లాయర్లు కోరారు. తిరుపతి రూరల్ పరిధిలో జేఏసీ బహిరంగ సభ నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంటల నుండి 6 వరకు సభకు అనుమతి లభించింది. అయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. పాదయాత్ర సమయంలో పోలీసులపై అమరావతి రైతులు దాడి చేశారని.. వీడియో ఫుటేజ్ చూపించారు ఏఏజీ. 


ప్రైవేట్ ప్రదేశంలో సభను నిర్వహించుకుంటే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది.  ఇటీవల కురిసిన భారీ వర్షల కారణంగా రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఏఏజీ చెప్పారు. ఒమిక్రాన్ కేసుల ఉన్న కారణంగా సభకు అనుమతించలేదని హైకోర్టుకు చెప్పారు.  బహిరంగ సభలో ఎలాంటి సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.  నిబంధనలకు లోబడి బహిరంగ సభను నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం, ప్రభుత్వం అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయావద్దని కోర్టు స్పష్టం చేసింది. 


మరోవైపు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అమరావతి రైతులకు టీటీడీ అనుమతి కూడా ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని వెల్లడించింది. రైతుల నుంచి అవసరమైన సమాచారాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి రైతుల న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ యాత్రను చేపట్టారు. అలిపిరి వద్దకు చేరుకున్న రైతులు గరుడ విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి యాత్ర ముగించిన విషయం తెలిసిందే. 44 రోజుల పాటు పాదయాత్ర కొనసాగింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా మీదుగా పాదయాత్ర సాగింది. 


 ఇటీవల మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. సమగ్రమైన బిల్లును తీసుకొస్తామని చెప్పింది. అయినా అమరావతి రైతులు వారి పోరాటాన్ని కొనసాగిస్తునే ఉన్నారు. ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా చేయాలని వారు కోరుతున్నారు. 


Also Read: AP Bus Accident: ప.గో.జిల్లాలో ఘోర ప్రమాదం.. వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు.. 9 మంది దుర్మరణం


Also Read: Chandru Chandrababu : కొంత మంది పేటీఎమ్‌ బ్యాచుల్లా తయారయ్యారు.. జడ్జిలుగా రిటైరై నేరస్తులకు సపోర్ట్ చేస్తారా ? .. చంద్రబాబు విమర్శలు


Also Read: Tirupati: పాఠాలు చెప్పమంటే.. ప్రేమ పాఠాలు చెప్పాడు.. తల్లిదండ్రులు ఏం చేశారంటే?