ఇన్‌ఫినిటీ ఇన్‌బుక్ ఎక్స్1 సిరీస్ ల్యాప్‌టాప్‌ల సేల్ మనదేశంలో ఈరోజు(డిసెంబర్ 15వ తేదీ) ప్రారంభం అయింది. ఇందులో రెండు మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవే ఇన్‌బుక్ ఎక్స్1, ఇన్‌బుక్ ఎక్స్1 ప్రో. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంను వీటిలో అందించడం విశేషం. ఇన్‌బుక్ ఎక్స్1లో ఇంటెల్ కోర్ ఐ3, కోర్ ఐ5 ప్రాసెసర్ ఆప్షన్లు లాంచ్ అవ్వగా.. ఇన్‌బుక్ ఎక్స్1 ప్రోలో ఐ7 వేరియంట్ అందుబాటులో ఉంది.


ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్స్ ఎక్స్1, ఇన్‌బుక్ ఎక్స్1 ప్రో ధర
ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1లో ఐ3 వేరియంట్ ధర రూ.35,999గా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ అందించారు. 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఉన్న ఐ5 వేరియంట్ ధర రూ.45,999గా నిర్ణయించారు. ఇక ఇన్‌బుక్ ఎక్స్1 ప్రో ధర రూ.55,999గా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌ను కంపెనీ అందించింది.


ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 స్పెసిఫికేషన్లు
14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఇందులో ఐ3, ఐ5 ప్రాసెసర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఐ3 ప్రాసెసర్ వేరియంట్‌లో 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ ఎం.2 ఎస్ఎస్‌డీ స్టోరేజ్, ఐ5 వేరియంట్‌లో 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512 జీబీ ఎం.2 ఎస్ఎస్‌డీ స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి.


విండోస్ 11 హోం ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్‌ను ఇందులో అందించారు. ఇందులో 720పీ వెబ్‌క్యాంను కూడా అందించారు. ఇందులో 1.5W స్టీరియో స్పీకర్లు అందించారు. దీంతోపాటు 0.8W ట్వీటర్లు కూడా ఇందులో ఉన్నాయి. డీటీఎస్ ఆడియో ప్రాసెసింగ్, రెండు మైక్రో ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయి.


ఇందులో 55Wh బ్యాటరీని అందించారు. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 1.63 సెంటీమీటర్లు కాగా, బరువు 1.48 గ్రాములుగా ఉంది. ఇందులో ఒక యూఎస్‌బీ 2.0, రెండు యూఎస్‌బీ 3.0 పోర్టులు కూడా ఉండనున్నాయి. దీంతోపాటు ఒక హెచ్‌డీఎంఐ 1.4, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నాయి. ఇందులో వైఫై, బ్లూటూత్ వీ5.1 వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందించారు.


ఇన్‌బుక్ ఎక్స్1 ప్రో స్పెసిఫికేషన్లు
ఇందులో కూడా 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేనే అందించారు. ఐ7 ప్రాసెసర్‌పైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది. విండోస్ 11 హోం ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ కూడా పని చేయనుంది.  16 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512 జీబీ ఎం.2 ఎస్ఎస్‌డీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లు ఎక్స్1 ప్రో తరహాలోనే ఉన్నాయి. అయితే ప్రో వేరియంట్‌లో మాత్రం వైఫై 6 ఫీచర్‌ను అందించారు. ఇక మిగతా ఫీచర్లన్నీ ఇన్‌బుక్ ఎక్స్1 తరహాలోనే ఉన్నాయి.


Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి