కార్ల బ్రాండ్ టాటా ఇటీవలే లాంచ్ చేసిన పంచ్ కారు పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇందులో మరిన్ని వేరియంట్లు రానున్నాయి. ప్రస్తుతం పంచ్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది 85 బీహెచ్‌పీ, 113 ఎన్ఎం టార్క్‌ను అందించనున్నాయి. ఏఎంటీ, మాన్యువల్ గేర్ బాక్స్ వేరియంట్లలో కూడా ఇదే ఇంజిన్ అందించారు.


లుక్‌కు తగ్గ ఇంజిన్ కావాలనుకుంటే.. పంచ్‌లో ఇంకా శక్తివంతమైన ఇంజిన్ అందించాలి. టాటాలోని వేర్వేరు కార్లలో ఉండే పవర్‌ఫుల్ ఇంజిన్లు పంచ్‌కు సరిపోతాయనే విషయంలో ఎటువంటి రహస్యం లేదు. 1.5 లీటర్ డీజిల్ లేదా 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పంచ్ కొత్త వేరియంట్‌లో అందించే అవకాశం ఉంది.


ఈ రెండు ఇంజిన్లూ అల్ట్రోజ్‌లో చూడవచ్చు. పంచ్ కూడా ఇదే ప్లాట్‌ఫాం మీద రూపొందించారు కాబట్టి ఈ ఇంజిన్ కూడా అందులో సరిపోయే అవకాశం ఉంది. హ్యాచ్‌బ్యాక్ కార్లలో అందుబాటులో ఉన్న కొన్ని డీజిల్ కార్లలో అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ కూడా ఒకటి. కాబట్టి పంచ్‌లో డీజిల్ వేరియంట్ కూడా లాంచ్ అయితే.. దీనికి ఎటువంటి పోటీ ఉండదు.


పంచ్ డీజిల్ వేరియంట్‌లో 1.5 లీటర్ డీజిల్ మోడల్ ఉండనుంది. ఇది 89 బీహెచ్‌పీ పవర్‌ను అందించనుంది. మాన్యువల్ గేర్ బాక్స్ కూడా ఇందులో ఉండనుంది. ఇక టర్బో పెట్రోల్ ఇంజిన్ పంచ్‌ను మరింత శక్తివంతంగా చేస్తుంది. టాటా అల్ట్రోజ్ టర్బో ఇంజిన్‌నే నెక్సాన్‌లో కూడా అందించారు. కానీ నెక్సాన్‌లా కాకుండా టర్బో పవర్ మోటర్‌లో పంచ్ కాస్త తక్కువ పవర్‌ను అందించే అవకాశం ఉంది.


ప్రస్తుతం పంచ్‌లో ఉన్న 1.2 లీటర్ ఇంజిన్ కంటే ఎక్కువ శక్తినే అందిస్తుందని చెప్పవచ్చు. టర్బో పెట్రోల్ వేరియంట్ మాత్రం 109 బీహెచ్‌పీ, 140 ఎన్ఎం టార్క్‌ను అందించనున్నాయని చెప్పవచ్చు. ఇందులో కూడా మాన్యువల్ గేర్‌బాక్స్‌ను అందించనున్నారు. ఈ వేరియంట్ ధర రూ.70 వేల నుంచి రూ.లక్ష పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంజిన్ సామర్థ్యం కూడా పెరుగుతుంది కాబట్టి.


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి