స్టాక్‌ మార్కెట్లో సంపదను వృద్ధి చేయొచ్చని చాలామందికి తెలుసు! సుదీర్ఘ కాలం పెట్టుబడులు కొనసాగించడం వల్ల మంచి రాబడులు వస్తాయని ఎన్నోసార్లు నిరూపితమైంది. అయితే ఎప్పుడు, ఎలాంటి స్టాక్‌లో ఎన్నాళ్లు పెట్టుబడి పెట్టాలన్నదే అసలు సమస్య. ఇది తెలియకపోవడం వల్లే చాలామంది నష్టపోతుంటారు. లేదా అనుకున్నంత సందపను ఆర్జించలేకపోతున్నారు.


ఐదేళ్ల కాలంలో పది కంపెనీల షేర్లలో రూ.10 లక్షల పెట్టుబడి పెట్టడం వల్ల ఇప్పుడు రూ.1.7 కోట్లు వచ్చిన ఉదాహరణ ఇది. ఈ కాలంలో ఆ కంపెనీలు వేగంగా అభివృద్ధి చెందాయి. ఇన్వెస్టర్లకు సంపదను పంచిపెట్టాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌, దీపక్‌ నైట్రేట్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, తన్లా ప్లాట్‌ఫామ్స్‌, రుచి సోయా, అల్కలీ అమైన్స్‌, వైభవ్‌ గ్లోబల్‌, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, పీ అండ్‌ జీ హెల్త్‌, ఎస్కార్ట్స్‌లో ఐదేళ్ల క్రితం పెట్టుబడి ఇప్పుడు భారీ స్థాయిలో వృద్ధి చెందింది.


2016-21 మధ్య కాలంలో అదానీ ట్రాన్స్‌మిషన్‌ ఏకంగా 93 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.38 కోట్ల నుంచి రూ.999కి చేరుకుంది. ఈ కంపెనీ పీఈ నిష్పత్తి సైతం 10 నుంచి 82కు పెరిగింది. ఇదే సమయంలో దీపక్‌ నైట్రేట్‌ 90, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 86, తన్లా ప్లాట్‌ఫామ్స్‌ 85, రుచిసోయా 81, అల్కలీ అమైన్స్‌ 79, వైభవ్‌ గ్లోబల్‌ 64, అపోలో ట్యూబ్స్‌ 60, పీ అండ్‌ జీ హెల్త్‌ 57, ఎస్కార్ట్స్‌ 56 శాతం సీఏజీఆర్‌ సాధించాయి. ఆసక్తికరంగా ఇందులో 7 కంపెనీల పీఈ రేషియో ఐదేళ్ల క్రితం 20లోపే ఉండటం గమనార్హం. అంటే తక్కువ పీఈ రేషియో ఉండి వేగంగా అభివృద్ధి సాధించే కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల సంపదను సృష్టించొచ్చు.


Also Read: Netflix vs Amazon: అమెజాన్‌కు నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్.. ధరలు 60 శాతం వరకు తగ్గింపు.. ఏ స్ట్రీమింగ్ సర్వీస్ ప్లాన్లు బెస్ట్?


Also Read: Bank Strike: కస్టమర్ అలర్ట్.. ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్


Also Read: Upcoming Budget EVs: కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లపై ఓ లుక్కేయండి!


Also Read: Elon Musk: ఆ క్రిప్టోకరెన్సీని పేమెంట్‌గా యాక్సెప్ట్ చేస్తానన్న ఎలాన్ మస్క్.. ఏ కాయిన్ అంటే?


Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్.. రూ.130 తగ్గిన పసిడి ధర.. నిలకడగా వెండి, నేటి ధరలు ఇవీ..


Also Read: Petrol-Diesel Price, 15 December: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రో, డీజిల్ ధరల్లో స్వల్ప తగ్గుదల.. నేటి ధరలు ఎంతంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి