డిసెంబర్ 16, 17 తేదీలలో ప్రభుత్వ రంగ బ్యాంకులు సమ్మె చేయనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ బ్యాంకు యూనియన్లు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ రెండు రోజుల సమ్మెలో తమ బ్యాంకింగ్ సాధారణ కార్యకలాపాలు కూడా ప్రభావితం కానున్నాయని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది.


ఆ రెండు రోజులు దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా డిసెంబర్ 16, 17 తేదీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలలోని సేవలు ప్రభావితం కావచ్చని బ్యాంక్ అధికారులు ప్రకటించారు.


బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు ఈ నెలలో రెండు రోజుల సమ్మె చేయనున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, 2021కి వ్యతిరేకంగానే సమ్మె చేయనున్నట్టు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది. దీంతో బ్యాంకు సేవలకు అంతరాయం కలగనుంది.


సంఘాలు..


ఈ రెండు రోజుల ధర్నాలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (INBEF), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (INBOC), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (NOBW), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (NOBO) సంఘాలు పాల్గొననున్నాయి.


Also Read: WPI Inflation: సామాన్యులకు మరో దెబ్బ.. 12 ఏళ్ల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం


Also Read: Omicron Cases in Delhi: దిల్లీలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు.. దేశంలో పెరుగుతోన్న వ్యాప్తి


Also Read: Char Dham Road Project: చార్‌ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్


Also Read: PM Modi: కాశీ వీధుల్లో కాలినడకన ప్రధాని మోదీ.. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు


Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గి కరోనా వ్యాప్తి.. పెరిగిన ఒమిక్రాన్ కేసులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి