టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) భారీగా పెరిగింది. ఈ ఏడాది నవంబర్‌లో రికార్డ్ స్థాయిలో 12 ఏళ్ల గరిష్ఠ స్థాయి అయిన 14.23 శాతంగా నమోదైనట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మినరల్ ఆయిల్స్​, బేసిక్ మెటల్స్​, తయారీ వస్తువులు, ఆహార ఉత్పత్తులతో పాటు ఇతర వస్తువుల ధరలు పెరగడమే నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణమని పేర్కొంది.






డబ్ల్యూపీఐ రెండంకెలపైన నమోదవడం వరుసగా ఇది ఎనిమిదో నెల కావడం గమనార్హం. అక్టోబరులో టోకు ద్రవ్యోల్బణం 12.54 శాతంగా ఉంది. గత ఏడాది నవంబర్​లో ద్రవ్యోల్బణం 2.29 శాతంగా ఉంది.


మరిన్ని..



  • తయారీ వస్తువులపై టోకు ద్రవ్యోల్బణం నవంబర్​లో 11.92 శాతంగా నమోదైంది. ఇది గత నెలలో 12.04 శాతం మాత్రమే ఉంది.

  • ముడి చమురు ద్రవ్యోల్బణం నవంబర్​లో 91.74 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది. ఇది అక్టోబర్​లో 80.57 శాతంగా ఉందని పేర్కొంది.

  • ఆహార వస్తువుల టోకు ద్రవ్యోల్బణం రెండింతలు పెరిగి 6.70 శాతానికి చేరింది. అక్టోబర్​ నెలలో ఇది 3.06 శాతంగా ఉండేది.


Also Read: Omicron Cases in Delhi: దిల్లీలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు.. దేశంలో పెరుగుతోన్న వ్యాప్తి


Also Read: Char Dham Road Project: చార్‌ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్


Also Read: PM Modi: కాశీ వీధుల్లో కాలినడకన ప్రధాని మోదీ.. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు


Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గి కరోనా వ్యాప్తి.. పెరిగిన ఒమిక్రాన్ కేసులు


Also Read: Elon Musk: అద్దె ఇంట్లో అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్


Also Read: ఈ బ్యాంకు హోమ్‌ , కార్‌ లోన్లపై వడ్డీరేట్లు తగ్గించింది.. ఎంతో తెలుసా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి