తెలంగాణలో గ‌వ‌ర్నర్ కోటా నామినెటేడ్ ఎమ్మెల్సీగా సిరికొండ మ‌ధుసూద‌నా చారి శాన‌స‌మండ‌లికి ప్రాతినిథ్యం వ‌హించ‌నున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను ప్రతిపాదించగా.. తాజాగా గవర్నర్ తమిళి అందుకు ఆమోద ముద్ర వేశారు. గ‌తంలో గవర్నర్‌ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి ప‌ద‌వీకాలం ఈ ఏడాది జూన్ 16న ముగిసింది. ఈ శ్రీనివాస్‌రెడ్డి స్థానంలో మ‌ధుసూద‌నాచారి పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివ‌ర్గం గతంలోనే సిఫార్సు చేసింది. తాజాగా గ‌వ‌ర్నర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ దీన్ని ఆమోదిందారు.


ఈ మేరకు రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధాన అధికారి శశాంక్ గోయ‌ల్ గెజిట్ నోటిఫికేష‌న్ విడుదల చేశారు. మంగళవారం (డిసెంబరు 14) నుంచి మ‌ధుసూధనా చారి ప‌ద‌వీకాలం ప్రారంభం కానుంది. ఈ మేర‌కు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ (జీఏడీ) ఉత్తర్వులు జారీ చేసింది.


అన్ని స్థానాలు టీఆర్ఎస్‌వే..
మరోవైపు, తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఎన్నికలు జరిగిన 6 స్థానాలనూ గెలుచుకుని క్లీన్‌ స్వీప్‌ చేసింది. మొత్తం 12 స్థానాలు ఖాళీ కాగా అందులో 6 స్థానాలు ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. ఇటీవల 6 స్థానాలకు ఎన్నికలు జరగ్గా అన్నింటినీ టీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నల్గొండలో కోటిరెడ్డి, ఖమ్మంలో తాతా మధు, కరీంనగర్‌-1లో భాను ప్రసాద్‌, కరీంనగర్‌-2లో ఎల్‌.రమణ, ఆదిలాబాద్‌లో దంతె విఠల్‌, మెదక్‌లో యాదవ రెడ్డి విజయం సాధించారు. మొత్తం స్థానాలు టీఆర్ఎస్ బుట్టలోనే పడడంతో ఆ పార్టీ శ్రేణులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ సహా మంత్రులంతా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.


Also Read: Gachibowli: గచ్చిబౌలిలో భారీ లూటీ.. ఇంట్లోకి వచ్చి ఫ్యామిలీనే బురిడీ కొట్టించి..


Also Read: Warangal: భార్య తోడు కోసం ఇద్దరు భర్తల పోరాటం.. మొదటి భర్తకు ట్విస్ట్, ఆ తర్వాత ఇద్దరికీ షాక్!


Also Read: Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ మూలాలు తెలుసా.. వాళ్లు నరరూప రాక్షసులుగా ఎందుకు మారారు?


Also Read: అత్త గొంతుపై గడ్డ పారతో పొడిచి చంపిన అల్లుడు, ఆ తర్వాత భార్యపై కూడా.. ఇంతలో..


Also Read: అబద్దాలతో బురిడీ కొట్టిస్తున్న శిల్పా చౌదరి - మరోసారి కస్టడీ కోరిన పోలీసులు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి