ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన చెడ్డీ గ్యాంగ్  ముఠాలు ఎక్కడివి? వాటి మూలాలు ఏంటి? వారు చేసే అకృత్యాలు.., అరాచకాల వెనక ఉన్న కథేంటి? ఎప్పటి నుంచి వారు ఈ వృత్తిలోకి ఎంటర్ అయ్యారు? ఇంతటి ఘోరాలకు పాల్పడే ముఠా నేత నేర్పిన పాఠాలను తూచా తప్పకుండా ఫాలో అయ్యే చెడ్డి గ్యాంగ్ గురించి ఎప్పుడు మెుదలయ్యాయి? 


చెడ్డి గ్యాంగ్ నేడు ఆంధ్రప్రదేశ్ లో వణుకు పుట్టిస్తున్న ప్రధాన దోపిడి ముఠా. ఇప్పటికే విజయవాడలో  రెండు వారాలుగా పోలీసులకు దొరక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్న చెడ్డీ గ్యాంగ్ మూలాలు గుజరాత్ లోని దవోద్ జిల్లా గూద్ బాలా తాలుకాలోని నహేడా అనే గిరిజన గ్రామం నుంచి ఉన్నాయి. వీరు దోపిడిలకు పాల్పడకముందు అడవిలోని పోడు భూములలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. అక్కడ వున్న జీవులను వేటాడటం ప్రధానవృత్తి.  పేస్ పార్థి అనేది వీరి తెగ. అయితే వీరు దోపిడిలు చేసే సమయంలో చెడ్డీలు ధరించి వస్తారు. కాబట్టి వీరికి చెడ్డీ గ్యాంగ్ అని పేరు వచ్చింది.


మొదట్లో వీరు ఎలాంటి దోపిడిలు చేయకుండా తమ వృత్తినే నమ్ముకొని జీవనం సాగించేవారు. కానీ ప్రకృతి విపత్తులు దాడి చేయడంతో వ్యవసాయం వీరికి కలిసి రాలేదు. వన్యమృగాలును వేటాడటం ప్రభుత్వం నిషేదించింది. దీంతో వీరికి ఏం చేయాలో దిక్కుతెలిని సమయంలో ఆ తెగ పెద్ద అయిన రాంజీ  ఒక ఐదుమందితో ముఠాను ఏర్పాటు చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చినట్లు చెప్తారు. అయితే  అలా తమ తెగను కాపాడుకొనేందుకు ప్రారంభమైన ముఠా క్రమంగా పదులు సంఖ్యలోకి విస్తరించింది. 1987లో ప్రారంభమైన వీరి దొంగతనాలు 1999లో భాహ్యప్రపంచానికి తెలిసి వచ్చింది. అప్పటి వరకు వీరి అకృత్యాల గురించి తెలిసినప్పటికీ ఎవ్వరు చేస్తున్నారన్నది మాత్రం బయటకు రాలేదు.


సీసీ కెమెరాలు వచ్చిన తరువాత వారి వేషబాషలు, చెడ్డీలు ధరించి, ఒళ్ళంతా ఆయిల్ పూసుకొని వారు చేసే ఘోరాలు బయటకు వచ్చాయి. వీరి కన్ను ఏ నగరం పై పడితే ఆనగరానికి నెలముందే చేరుకొని  వివిధ రకాలుగా వివిధ ప్రాంతాల్లో రెక్కీలు నిర్వహిస్తారు. పోలీసుల రికార్డుల ప్రకారం అవసరమైతే వారు దొంగతనాలు చేసే ఇళ్ళపైనే వుండి తెల్లవారుజామునే దాడికి తెగబడతారు. వారు ఇంట్లోకి వచ్చినపుడు కిక్కురమనుకుండా నోరు మూసుకొని వుంటే వారి పని వారు చేసుకొని వెళ్లిపోతారు. లేకపోతే వారి పని అంతే. వారి ముఠా నాయకుడు రాంజీ చెప్పిన సూత్రాలు తప్పక ఫాలో అయ్యే పార్థీ గ్యాంగ్ చేసే అరాచకాలకు అంతువుండదంటున్నారు పోలీసులు. పొరపాటుగా ఎవరైనా ఈ ముఠాలో సభ్యులు పట్టుపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరిపేరు చెప్పరన్నది పోలీసుల రికార్డుల మాట. అంతలా వీరి మధ్య యూనిటీ వుంటుంది.


తాము చేసే వ్యవసాయం, వన్యప్రాణుల వేట నిషేధం తరువాత దొంగల ముఠాలుగా మారిన పార్థీ తెగ మొదట్లో ఉత్తరాది రాష్ట్రాల్లో దొంగతనాలు చేసేవారని, కానీ అక్కడ కేసులు ఎక్కువ కావడంతో, తరువాత వారి దృష్టి దక్షిణాది రాష్ట్రాల పై పడినట్టు చెబుతున్నారు. ఏడు నుంచి ఎనిమిది మందితో వుండే ఈ సభ్యుల ముఠాల ఆటకట్టించేందుకు  ఏపీ పోలీసులు నానా అవస్థలు పడుతున్నారు. జాగ్రత్తగా వుండండి, అనుమానితులు కానీ, బెడ్షీట్లు అమ్మేవారు రూపంలోకానీ, వెంట్రుకలు సేకరించే వారి రూపంలో ఇతర భాషలు మాట్లాడేవారు కానీ కనిపిస్తే వెంటనే పోలీసులకు చెప్పాలని సూచిస్తున్నారు. వీలైనంత తొందరగా ప్రజలు సహకరిస్తే వారి ఆట కట్టిస్తామంటున్నారు పోలీసులు.


Also Read: Nellore: బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు... 15 గంటల్లోనే కిడ్నాపర్లు అరెస్టు


Also Read: Viveka Case : వివేకా కుమార్తె, అల్లుడి నుంచి ప్రాణహానీ... కడప ఎస్పీకి ఫిర్యాదు చేసిన వివేకా పీఏ కృష్ణారెడ్డి !


Also Read: Cm Jagan: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ... నోటీసులు జారీ చేసిన హైకోర్టు