మేషం
ఈ రోజు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఉల్లాసంగా, ఉత్సాహంగా అందర్నీ ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో అర్థంలేని చర్చలు చేయొద్దు. వివాదాలు జరిగే సూచనలున్నాయి మీరు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. గుర్తుతెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
వృషభం
అనవసర మాటలు వద్దు. కుటుంబంలో ఒకరి అనారోగ్య కారణంగా మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకొన్నాళ్లు కొనసాగుతాయి. మీరు స్నేహితులను కలుస్తారు. ఆఫీసులో సహోద్యోగుల సహాయం అందుతుంది.
మిధునం
పొదుపుపై దృష్టి పెట్టండి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాధ్యతలు నెరవేర్చడం వల్ల మానసిక సంతృప్తి పెరుగుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. పని బాగానే సాగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పాత స్నేహితుడిని కలవొచ్చు.
Also Read: భగవద్గీత పూజించడానికి మాత్రమే కాదు.. మనిషిగా బతకడానికి
కర్కాటకం
ఈ రోజు ప్రణాళిక ప్రకారం ముందడుగు వేయడం మంచిది. మీ పనితీరులో మార్పు ఉంటుంది. ఈరోజు మీ బాధ్యతలన్నీ నెరవేరుతాయి. మీరు కొత్త పథకంలో పెట్టుబడి పెడతారు.
సింహం
పెట్టిన పెట్టుబడుల్లో కొంత నష్టపోతారు. కుటుంబానికి సంబంధించిన అనేక బాధ్యతలను మీరు నిర్వర్తించవలసి ఉంటుంది. ఉద్యోగాలు మారే అవకాశం ఉంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. రోజంతా బాగానే ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యం క్షీణించవచ్చు. ఎవరితోనైనా వివాదాలు వచ్చే అవకాశం ఉంది.
కన్య
మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఉన్నదాంతో సంతృప్తి చెందాలి. దేనిమీదా అత్యాశ వద్దు. తప్పుడు ఆలోచనల నుంచి దూరంగా ఉండాలని మీ మనస్సాక్షి సూచిస్తుంది. మీ ఆలోచనల్లో ప్రతికూలతలు రానివ్వకండి. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు.
Also Read: వారణాసి మహిమను వివరించే కాశీవిశ్వనాథ్ కారిడార్.. అక్కడ అణువణువూ ప్రత్యేకమే
తుల
ఈ రోజు ఎక్కువ ఖర్చు చేస్తారు. అనవసరమైన పనులు పెట్టుకోవద్దు. మీ మనస్సును అదుపులో ఉంచుకోండి. ఇతరుల సలహా తీసుకోకండి..మీకు తోచినది చేయండి. ఈరోజు టెన్షన్ పెరగొచ్చు. మీరు ఒకేసారి చాలా విషయాలు ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది, హాని కలిగిస్తుంది. ఏ పనీ పూర్తి చేయలేరు.
వృశ్చికం
రోజు ప్రారంభం అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు. సామాజిక సేవలో పాల్గొంటారు. మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీరు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు. మీరు కొత్త ప్రణాళికను రూపొందించవచ్చు.
ధనుస్సు
బంధువులను కలుసుకుంటారు. పూర్వీకుల వ్యవహారాలు ముందుకు సాగుతాయి. ఈ రోజంతా సానుకూలంగా ఉంటారు. కొన్ని పనుల కారణంగా మీరు వేరే ఊరికి వెళ్లాల్సి రావచ్చు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. డబ్బు సంపాదించే అవకాశం ఉంది.
Also Read: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని- ప్రపంచ సాంస్కృతిక నగరం… వారణాసి గొప్పతనం ఇదే..
మకరం
ఈ రోజంతా చిరాకుగా ఉంటారు. వ్యాపారాన్ని పెంచుకోవడానికి అనుభవజ్ఞుల నుంచి సహాయం పొందండి. ఆనారోగ్య సమస్యలు ఉండొచ్చు. అనవసరంగా ఖర్చు పెట్టకండి. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు. మీరు ఏ బాధ్యతను నిర్వర్తించలేక ఆందోళన చెందుతారు.
కుంభం
విద్యార్థులకు ఈరోజు మంచి రోజు. స్నేహితుడి కారణంగా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది జాగ్రత్త. తప్పుడు సంభాషణలకు దూరంగా ఉండండి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. వేరొకరు చెప్పినట్టు ఆడొద్దు. ఇది మిమ్మల్ని అనవసరమైన ఇబ్బందుల నుంచి కాపాడుతుంది.
మీనం
మీరు ఈరోజు మానసికంగా దృఢంగా ఉంటారు. మీరు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. భూమి లేదా వాహనాలను కొనుగోలు చేయవచ్చు. ఈ రోజంతా బాగానే ఉంటుంది.
Also Read: శవాలు దహనం చేసే ఘాట్ సహా కాశీలో ముఖ్యమైన ఘాట్లు ఇవి..
Also Read: కాశీలో వదిలేయాల్సింది కాకరకాయో, కమలాపండో కాదు…
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
Also Read: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని- ప్రపంచ సాంస్కృతిక నగరం... వారణాశి గొప్పతనం ఇదే..
Horoscope Today 14 December 2021: ఈ రోజు ఈ రాశివారి పనితీరు మారుతుంది, ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి..
ABP Desam
Updated at:
14 Dec 2021 06:03 AM (IST)
Edited By: RamaLakshmibai
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
2021 డిసెంబరు 14 మంగళవారం రాశిఫలాలు
NEXT
PREV
Published at:
14 Dec 2021 06:03 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -