నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం గంగపట్నం గ్రామంలో  మూడేళ్ల బాలిక మానికల పల్లవి కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలు, బిడ్డను కొనడానికి రూ.32 వేల నగదు సమకూర్చిన మహిళను మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు. కేవలం 15 గంటల సమయంలో కిడ్నాపర్లను ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. బాలికను గంగపట్నం కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు ప్రమీల, శ్వేత స్కూటీపై బాలిక తీసుకెళ్లారు. కిడ్నాపర్ల వాహనాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించిన పోలీసులు... వాళ్లను నెల్లూరు జేమ్స్ గార్డెన్ కి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మహిళల వద్ద రూ.32 వేలకు బిడ్డను కొన్న జహీరాని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోదరి చనిపోవడంతో తన తల్లి ఒంటరిగా ఉంటోందని, ఆమె పెంచుకోడానికి బిడ్డను కొనుగోలు చేశానని ఒప్పుకుంది జహీరా. కిడ్నాప్ అయిన బిడ్డ దొరికిందన్న సమాచారంతో తల్లిదండ్రులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. 


Also Read: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ... నోటీసులు జారీ చేసిన హైకోర్టు


అసలేం జరిగింది?


ఇందుకూరుపేట మండలం గంగపట్నం బృందావనం కాలనీలో ఆదివారం మూడేళ్ల చిన్నారి పల్లవిని గుర్తుతెలియని మహిళలు అపహరించారు. బృందావన కాలనీకి చెందిన మానికల శులామయ్య, పోలమ్మకు ఐదుగురు సంతానం. పల్లవి తల్లిదండ్రులు ఆదివారం గ్రామంలోని చాముండేశ్వరి ఆలయంలో పనికి వెళ్లారు. ఇంటి వద్ద ఉన్న మూడేళ్ల వయసున్న పల్లవి ఆడుకుంటుండగా గుర్తు తెలియని ఇద్దరు మహిళలు ద్విచక్రవాహనంపై వచ్చి పండ్లు కొనిస్తామని ఆశ చూపారు. దీంతో బైక్ వద్దకు వచ్చింది బాలిక. వెంటనే చిన్నారిని బైక్ పై మధ్యలో కూర్చొబెట్టుకుని అక్కడ నుంచి పరారయ్యారు. వీరికి మరో ఇద్దరు యువకులు సాయపడినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ సీసీ ఫుటేజీ పరిశీలించారు. నెల్లూరు గ్రామీణ డీఎస్పీ వై.హరినాథరెడ్డి దగదర్తి, బుచ్చి, నెల్లూరు పోలీసులను ఆరు స్పెషల్ టీమ్ లుగా ఏర్పాటు చేసి కిడ్నాపర్ ల కోసం గాలింపు చేపట్టారు. టవర్‌ డంప్‌ ద్వారా కిడ్నాపర్ల సిగ్నల్ ట్రేస్ చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించారు.  


Also Read: అబద్దాలతో బురిడీ కొట్టిస్తున్న శిల్పా చౌదరి - మరోసారి కస్టడీ కోరిన పోలీసులు !


Also Read: అత్త గొంతుపై గడ్డ పారతో పొడిచి చంపిన అల్లుడు, ఆ తర్వాత భార్యపై కూడా.. ఇంతలో..


Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి