నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే నిధులతో 50 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి.. నూతనంగా నిర్మించిన ప్రజా కల్యాణ మండపాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంబించారు. ఇప్పుడున్న కాలంలో పేదవారు పెళ్లి చేయాలంటే ఫంక్షన్ హాల్ కోసం చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి పరిస్థితి ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామంలో ఉన్న పేదవారు అతి తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే నిధుల నుంచి కల్యాణ మండపం నిర్మించినట్టు చెప్పారు.
కల్యాణ మండపాన్ని సుందరగా నిర్మించారని మంత్రి వేముల అన్నారు. కల్యాణ మండపం నిర్వహణ బాధ్యతలు గ్రామ పంచాయతీకి అప్పజెప్పారు. మంత్రి వేముల నానమ్మ, తాతయ్య ల పేర్ల మీదుగా ప్రజలకు ఇబ్బంది ఉండకుండా కల్యాణ మండపంలో అవసరమైన కుర్చీలు, బల్లలు, వంట సామగ్రిని రూ.5 లక్షల సొంత డబ్బుతో ఏర్పాటు చేశారు.
గ్రామ పంచాయతీ మండపం నిర్వహణ బాధ్యతలు తీసుకున్నందున పేద ప్రజలకు ఎక్కువ భారం పడకుండా కల్యాణ మండపాన్ని పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఇవ్వాలని మంత్రి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రం తన సొంత గ్రామం అని.. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. పార్టీలకతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా.. అర్హులైన పేదవారికే ఇచ్చామని చెప్పారు.
సీఎం కేసీఆర్ గతం లో వేల్పూర్ పర్యటన కి వచ్చినపుడు గ్రామం మొత్తం 3 కోట్ల విలువైన ఫ్రీ డ్రిప్ మంజూరు చేశారని అందులో అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్నారని..అందరూ రైతులకు లాభం చేకూరింది అని మంత్రి అన్నారు.
Also Read: Cm Jagan: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ... నోటీసులు జారీ చేసిన హైకోర్టు
Also Read: Congress: జవాను సాయితేజ మరణంపై వీహెచ్ సంచలన కామెంట్స్.. సీఎంలు కేసీఆర్, జగన్‌పైన కూడా..
Also Read: Nagari Roja : నగరిలో రోజాకు "పంచ పాండవుల" కటీఫ్ .. మూడో సారి తప్పు చేయబోమని ప్రతిజ్ఞ !
Also Read: Jagananna Vidya Deevena: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్... విద్యాదీవెన రివ్యూ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు