Cryptocurrency Prices Today, 13 December 2021: క్రిప్టో మార్కెట్‌ సోమవారం ఒడుదొడుకుల్లో కనిపించింది. మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 0.39 శాతం తగ్గి రూ.39.46 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.70 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరియమ్‌ 0.42 శాతం తగ్గి రూ.3,23,309 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.36 లక్షల కోట్లుగా ఉంది.


బైనాన్స్‌ కాయిన్‌ 2.98 శాతం తగ్గి రూ.44,547, టెథెర్‌ 0.06 శాతం పెరిగి రూ.81.04, సొలానా 2.39 శాతం తగ్గి రూ.13,365, కర్డానో 1.67 శాతం తగ్గి రూ.107, యూఎస్‌డీ కాయిన్‌ 0.07 శాతం తగ్గి రూ.81.08 వద్ద కొనసాగుతున్నాయి. ఇక ఎయిర్‌స్వాప్‌, సుషి, క్వాంట్‌స్టాంప్‌, కర్వ్‌ ఏడీఓ, లించ్‌, పొల్కాడాట్‌ 1 నుంచి 14 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. ఎన్‌కేఎన్‌, గోలెమ్‌, అయిలెఫ్‌, పాలీగాన్‌, మెటల్‌, గ్యాస్‌ ఆగుర్‌ 2-6 శాతం వరకు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.


క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.


భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.


Also Read: PM Modi on Bank Deposit: నష్టాల్లోని బ్యాంకుల్లో డిపాజిటర్ల కష్టాలు చూడలేకే రూ.5 లక్షల బీమా తెచ్చాం: మోదీ


Also Read: Prime Membership Cost: నేడే ఆఖరి అవకాశం.. రేపు కొంటే ఏకంగా 50 శాతం పెంపు!


Also Read: Broadband Tariff Update: టెలికాం బాటలో బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీలు.. త్వరలోనే ఇంటర్నెట్‌ ధరల పెంపు?


Also Read: Interest Rate Cut: ఈ బ్యాంకు హోమ్‌ , కార్‌ లోన్లపై వడ్డీరేట్లు తగ్గించింది.. ఎంతో తెలుసా?


Also Read: Gold-Silver Price: అతి స్వల్పంగా పెరిగిన బంగారం.. స్థిరంగా ఉన్న వెండి, నేటి తాజా ధరలు


Also Read: Petrol-Diesel Price, 13 December: పెరుగుతున్న ముడి చమురు ధరలు.. నేడు పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి