కొన్నేళ్ల క్రితం వరకు బ్యాంకింగ్‌ సమస్యలను కార్పెట్‌ కింద దాచిపెట్టడం అలవాటుగా ఉండేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కానీ ఇప్పుడు సరికొత్త భారత్‌ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. గత యూపీఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించిన ఆయన విమర్శలు చేశారు.






తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్యాంకు డిపాజిట్లపై బీమాను రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేసినట్లు మోదీ గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు అలా చేయకపోవడంతో తనను చేయమని ప్రజలు పార్లమెంటుకు పంపించారని వెల్లడించారు. బ్యాంకు డిపాజిట్‌ బీమా కార్యక్రమం “Depositors First: Guaranteed Time-bound Deposit Insurance Payment up to Rs. 5 Lakh”లో  ప్రధాని మోదీ మాట్లాడారు.






'నిర్దేశిత సమయం లోపు డిపాజిట్‌ దారులకు బీమా సొమ్ము చెల్లించడమే ఈ పథకం ముఖ్యోద్దేశం. ఏడాదిలోనే లక్షల మంది డిపాజిట్‌ దారులకు రూ.1300 కోట్లు చెల్లించాం. బ్యాంకులను కాపాడి డిపాజిట్‌ దారులకు భద్రతనివ్వడమే ముఖ్యమైతే మేం ఆ రెండు పనులు చేశాం. బ్యాంకులు ఇబ్బందుల్లో, నష్టాల్లో, దివాళా అంచుల్లో ఉన్నప్పుడు పేదలు, మధ్యతరగతి వారు తమ డబ్బులు తిరిగి పొందేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు' అని ప్రధాని మోదీ అన్నారు.


'డిపాజిట్‌దారుల కష్టాలను చూడలేకే ప్రభుత్వం నిర్దేశిత సమయంలోపు వారికి బీమా పరిహారం ఇప్పించేందుకు పూనుకుంది. దివాళా స్థితిలోని బ్యాంకుల నుంచి వచ్చే బీమా పరిహారాన్ని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాం. 98 శాతం ఖాతాదారులు దీని పరిధిలోకి వచ్చారు. 90 రోజుల్లోనే బీమా డబ్బులు వస్తున్నాయి. ఈ పథకం వల్ల అంతర్జాతీయంగా 80 శాతం మందికే డబ్బులు తిరిగొస్తుంటే భారత్‌లో మాత్రం 98.1 శాతం మందికి వస్తున్నాయి' అని మోదీ వెల్లడించారు.


Also Read: International Commercial Flights: అంతర్జాతీయ విమాన సేవలపై కీలక ప్రకటన.. ఒమిక్రాన్ వ్యాప్తి వల్లే నిర్ణయం


Also Read: Social Media: భార్యను ట్రోల్‌ చేశారని.. బ్లాక్‌చైన్‌తో సొంత సోషల్‌ మీడియా!


Also Read: Passenger Vehicle Sales: భారీగా పడిపోయిన వాహనాల సేల్స్.. కారణం అదే.. ఇలా అయితే సమస్యలు తప్పవు!


Also Read: Petrol-Diesel Price, 12 December: వాహనదారులకు స్వల్ప ఊరట.. స్థిరంగా ఇంధన ధరలు.. ఈ నగరంలో భారీ పెరుగుదల


Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు షాక్.. రూ.140 పెరిగిన ధర, ఎగబాకిన వెండి రేటు


Also Read: Aadhaar Card News: ఆధార్‌ కార్డులో అడ్రెస్, పేరు, పుట్టిన తేదీ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?