దేశంలో చాలా అధికారిక పనులకు ఆధార్‌ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది లేనిదే ఒక చోట నుంచి ఇంకో చోటకు ట్రావెల్ చేయలని పరిస్థితి. ప్రభుత్వ పనులకే కాకుండా ప్రైవేట్ సెక్టార్‌లో కూడా ఆధార్‌ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్‌గా పరిగణిస్తారు. 
అందుకే దీనికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ చాలా ముఖ్యం. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టాన్ని మిగులుస్తుంది. 
అందుకే ఎప్పటి కప్పుడు మీ ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ అయి ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఆధార్‌ కార్డు తీసుకున్నప్పుడు గుర్తంచలేని తప్పులను కార్డు చేతికి వచ్చిన తర్వాత చాలా మంది గుర్తిస్తుంటారు. అలాంటి తప్పులను ఎలా సరిదిద్దు కోవాలో తెలియక హైరానా పడుతుంటారు. 


ముఖ్యంగా అడ్రస్ మార్పులు, పేరు, పుట్టిన తేదీలో ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. 


ఆధార్‌ కార్డులో పేరును ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?
UIDAI ఇచ్చిన రూల్స్ ప్రకారం ఒక వ్యక్తికి ఆధార్‌ కార్డు వచ్చిన తర్వాత పేరును  రెండు సార్లు మాత్రమే మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీలుంటుంది. తర్వాత పేరులో ఛేంజెస్‌ కుదరదు. 


ఆధార్‌లో పుట్టిన తేదీని ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?


ఒకసారి ఆధార్‌ కార్డు జనరేట్ అయ్యాక పుట్టిన తేదీల్లో మార్పులు కుదరదు. డేట్ ఎంట్రీలో తప్పుంటే కానీ మార్చడం కుదరదు. అందుకే మీరు ఆధార్ తీసుకున్నప్పుడే డేట్ ఆఫ్ బర్త్ జాగ్రత్తగా ఎంటర్ చేయించుకోవాలి. 


ఆధార్‌ కార్డులో అడ్రెస్‌ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?


UIDIA గైడ్‌లైన్స్‌ ప్రకారం ఆధార్‌ కార్డులో అడ్రెస్‌ను ఒకసారి మాత్రమే మార్చుకోగలరు. 


ఆధార్‌లో మార్పులు చేర్పులకు ఎలాంటి పత్రాలు అవసరం అవుతాయి?


ఆధార్‌ కార్డు కావాలన్నా... మార్పులు చేర్పులు చేయాలన్నా ఈ కింది డాక్యుమెంట్స్‌లో ఏదో ఒకటి అవసరం అవుతాయి.



  1. పాస్‌పోర్టు

  2. బ్యాంక్ స్టేట్‌ మెంట్

  3. బ్యాంక్ పాస్‌బుక్

  4. పోస్టాఫీస్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్

  5. పోస్టాఫీస్‌ అకౌంట్‌ పాస్‌బుక్‌

  6. రేషన్ కార్డు

  7. ఓటర్‌ ఐడీ కార్డు

  8. డ్రైవింగ్ లైసెన్స్

  9. ప్రభుత్వం గుర్తించిన ఐడీ కార్డు

  10. పీఎస్‌యూ గుర్తించిన ఫొటో ఉన్న సర్వీస్ ఐడీ కార్డు

  11. కరెంట్ బిల్లు(మూడు నెలలకు మించనిది)

  12. వాటర్‌ బిల్లు(మూడు నెలలకు మించనిది)

  13. ఆస్తి పన్ను చెల్లింపు రసీదు(ఏడాది లోపు చెల్లించింది)

  14. క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్(మూడు నెలలకు మించనిది)

  15. ఇన్సురెన్స్ పాలసీ పత్రం 


Also Read: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


Also Read: ఆధార్ కార్డ్‌లో వివరాలు అప్‌డేట్ చేస్తున్నారా.. ఈ కొత్త రూల్ తెలుసుకోండి


Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి