గతంలో ఏదైనా ప్రభుత్వ పథకాలు, ఇతర అప్లికేషన్లకు గానీ ప్రభుత్వ గుర్తింపు కార్డుల పత్రాలను సమర్పించేవారు. అయితే యూపీఏ హయాంలో తీసుకొచ్చిన ఆధార్ కార్డ్ విధానాన్ని బయోమెట్రిక్ కోసం వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆధార్ కార్డు ప్రాధాన్యత, వినియోగం ఎలా ఉందనేది ప్ర‌త్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కూ, సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేస్తున్నారు. ముఖ్యంగా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అనుసంధానం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇదివరకే కొన్ని పర్యాయాలు తుది గడువును పొడిగించాయి.


ఆధార్ కార్డ్ గురించి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. ఆధార్ కార్డులో తండ్రి/భ‌ర్త అనే సంబంధాలను తొలగిస్తూ ఉడాయ్ (UIDAI) నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బంధుత్వాన్ని తెలపకుండా ఆధార్- కార్డులో కొత్తగా కేర్ ఆఫ్ అనే వివరాలు వస్తాయి. ఇకనుంచి సంబంధాలు తెలిపే స్థానంలో కేరాఫ్ అనే ప‌దాన్ని అప్‌డేట్ చేయనున్నారు. బంధుత్వం బదులుగా సంర‌క్ష‌కుడి పేరు రాస్తే చాలు అని చెబుతున్నారు. ఇకనుంచి ఆధార్ కార్డ్ అప్‌డేట్స్ చేయించుకునే వారికి ఈ మార్పులు చేర్పులు కొత్త కార్డులో కనిపిస్తాయి. తమ ఆధార్ కార్డులో ఏదైనా వివరాలు, ఫొటో లాంటి ఏదైనా అప్ డేట్ చేసుకున్న వారికి కొత్త విధానం అమలవుతుంది. 


Also Read: FD Interest Rates: చిన్న బ్యాంకులే.. కానీ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు అదుర్స్.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ కంటే అధిక వడ్డీ మీ సొంతం


ఢిల్లీకి చెందిన రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ రణధీర్ సింగ్‌కు ఈ అనుభవం ఎదురైంది. ఇంటి చిరునామా మారిందని, ఆధార్ కార్డులో అప్ డేట్ చేయించగా కొత్త ఆధార్ కార్డులో కేర్ ఆఫ్ (Care Off) అని కనిపించడంతో తప్పుగా ముంద్రించారని రిటైర్డ్ అధికారి భావించారు. మిగతా సెంటర్లకు వెళ్లగా అదే సీన్ రిపీట్ అయింది. ప్రతి దాంట్లో కేరాఫ్ అని వచ్చింది. అశోక్ విహార్ పోలీస్ కాలనీలో నివాసం ఉండే రణధీర్ సింగ్ ఇటీవల పితంపురకు షిఫ్ట్ అయ్యారు. ఆధార్ కార్డులో ఇంటి చిరునామా మార్పించే ప్రయత్నం చేయగా కొత్త మార్పులు గమనించానని చెప్పారు. కుమారుడి ఆధార్ కార్డ్‌లో వివరాలు మార్పించగా అందులోనూ సన్ ఆఫ్ అనే దానికి బదులుగా కేర్ ఆఫ్ అని రావడంతో అధికారులను సంప్రదించి రూల్స్ మారాయని తెలుసుకున్నారు.  


Also Read: Google Pay FD: గూగుల్ పే సరికొత్త సౌకర్యం.. బ్యాంక్ అకౌంట్ లేకున్నా 2 నిమిషాల్లో ఎఫ్‌డీ.. ఎలాగో తెలుసా


సుప్రీంకోర్టు గతంలో ఏం చెప్పింది..
సుప్రీంకోర్టు ఆధార్ కార్డుకు సంబంధించి 2018లో కీలక తీర్పు వెల్లడించింది. దేశంలోని పౌరుల గోప్యతకు ఏ విధంగానూ భంగం కలిగించకూడదని ఉడాయ్ (UIDAI)కు సూచించింది. మొబైల్ నెంబర్‌ తీసుకునే సమయంలో ఆధార్ తప్పని సరి కాదని గతంలో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఆపై వ్యక్తుల గోప్యతపై సైతం కీలక నిర్ణయం తీసుకుంది. బంధుత్వాన్ని తెలిసేలా ఆధార్ కార్డులో వివరాలు పొందుపరచవద్దు అని సూచించింది. అయితే తాజాగా కేరాఫ్ (Care Off) అని ఆధార్ కార్డులో వివరాలు వచ్చేలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ ఆధార్ అప్‌డేట్ చేసుకున్న వారికి సన్నాఫ్, వైఫ్ ఆఫ్ లాంటి రిలేషన్స్ లేకుండా కేవలం కేరాఫ్ అని మాత్రమే వస్తుంది.


Also Read: EPFO New Rules: ఈపీఎఫ్ఓ కొత్త రూల్ గురించి తెలుసా? అలా చేయకపోతే ఆ డబ్బులు హాంఫట్!