ఈరోజు (సెప్టెంబర్ 1) నుంచి ఈపీఎఫ్ (ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్) రూల్స్ మారిపోయాయి. ఇప్పటివరకు ఆధార్‌తో ఈపీఎఫ్ ఖాతాను లింక్ చేయకపోతే కంపెనీ (యజమాని) వాటా జమ కాదు. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ని ఆధార్ కార్డుతో లింక్ చేయడం ఈపీఎఫ్ఓ తప్పనిసరి చేసింది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ ​​సామాజిక భద్రత కోడ్ 2020 సెక్షన్ 142లో మార్పులు చేసింది. 


Also Read: 8 మందిని మ్యారేజ్ చేసుకుంది.. మరో పెళ్లి చేసుకోబోతుంటే.. భర్తలకు చెమటలు పట్టే ట్విస్ట్ తెలిసింది


లింక్ చేసుకోకపోతే..



  • కంపెనీలు/సంస్థ యజమానులు వాళ్ల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలోకి డబ్బు జమ చేయడం సాధ్యం కాదు.

  • రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందడమూ వీలుకాదు. 

  • పీఎఫ్ కంట్రిబ్యూషన్ అందకపోవడమే కాదు.. ఇతర ఈపీఎఫ్ఓ సేవలు కూడా ఆగిపోతాయి.

  • పెన్షన్ ఫండ్‌ నుంచి డబ్బు తీసుకోవడం కూడా కష్టం.

  • వడ్డీని కూడా పొందలేరు.

  • కంట్రిబ్యూషన్లు డిపాజిట్ చేయకపోవడం వల్ల యజమానులు (కంపెనీలు) డిఫాల్టర్లు అవుతారు. ఫలితంగా చట్టప్రకారం శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది.


Also Read: Heart Attack: చిన్న వయసులోనే గుండెపోటు.. ప్రమాదంలో భారత యువత, కారణాలు ఇవే..


ఈసీఆర్ రూల్స్..


ఈ ఏడాది జూన్‌ నుంచి ఆర్గనైజేషన్ ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ఈసీఆర్) దాఖలు చేసే రూల్స్ కూడా మారాయి. ఇక నుంచి ఆధార్‌తో లింక్ అయిన పీఎఫ్ ఖాతాకు మాత్రమే ఎలక్ట్రానిక్ చలాన్-కమ్ -రిటర్న్‌లను దాఖలు చేయడానికి యజమానులను అనుమతిస్తామని ఈపీఎఫ్‌ఓ ఇది వరకే ప్రకటించింది.


ఈపీఎఫ్ఓ ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం అందిస్తుంటుంది. పీఎఫ్-ఆధార్ లింక్ పై కుడా చాలానే ట్వీట్లు చేసింది.