పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన జల్సా సినిమా ఏ రేంజ్ లో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆడియో విని ఫ్యాన్స్ కి పూనకాలొచ్చాయి. ఇప్పటికీ ఆ పాటలు వింటే గాల్లో తేలిపోతారు. ఆ మ్యాజిక్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీదే. అందుకే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఊహించని స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్.
అప్పట్లో జల్సా సినిమా ప్రమోషన్స్ కోసం దేవీశ్రీ ప్రసాద్ పై ఒక ప్రచార వీడియోని సిద్ధం చేసింది చిత్రయూనిట్. కానీ అది అప్పట్లో రకరకాల కారణాల వల్ల విడుదల కాలేదు. ఆ వీడియోని ఇప్పుడు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్- త్రివిక్రమ్ ప్రోద్భలంతో విడుదల చేస్తున్నామని దేవీశ్రీ ప్రకటించాడు. జల్సా టైటిల్ సాంగ్ కి రాక్ స్టార్ దేవీశ్రీ స్టెప్పులేస్తున్న ఈ వీడియో ఇలా రిలీజైందో లేదో అలా సునామీ స్పీడ్ తో దూసుకుపోతోంది.పాటతో పాటూ స్టెప్పులు కూడా జోడించి ఉత్సాహాన్ని పెంచే దేవిశ్రీప్రసాద్..జల్సా టైటిల్ సాంగ్ కి స్టెప్పులేస్తుంటే చూసి ఫ్యాన్స్ కూడా ఊగిపోతున్నారు. ఇక దేవిశ్రీప్రసాద్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ సినిమాకి సంగీత అందించేందుకు సిద్ధమవుతున్నాడు. పవన్ ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ `భీమ్లా నాయక్`, హరిహరివీమల్లు చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నాడు. ఇంకా మరో నాలుగు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ''భీమ్లా నాయక్''. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ దుమ్ములేపాయి. ఈరోజు పవన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన12 నిముషాల్లో 100K లైక్స్ తో దుమ్ము దులిపేస్తోంది. ఇప్పుడు దేవిశ్రీ ఇచ్చిన గిఫ్ట్ కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఏదేమైనా పవన్ కల్యాణ్ కి బర్త్ డే శుభాకాంక్షల్ని ఇంత స్పెషల్ గా ప్లాన్ చేసినందుకు దేవీకి థ్యాంక్స్ చెబుతున్నారు పవర్ స్టార్ అభిమానులు.
Also Read: పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. జనంలో ఉంటాడు.. జనంలా ఉంటాడు, ఇదీ పవర్ స్టారంటే!
Also Read:పవన్ కళ్యాణ్ సేఫ్ జర్నీ.. రిమేక్ సినిమాలే బెటర్ అనుకుంటున్న పవర్ స్టార్?