అఫ్గానిస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటు కోసం తాలిబన్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా దళాలు అఫ్గాన్ ను వీడిన తర్వాత తాలిబన్లు జోరు పెంచారు. అయితే కొత్త ప్రభుత్వం ఎవరి నాయకత్వంలో పనిచేయనుందన్న విషయంపై తాజాగా తాలిబన్లు స్పష్టత ఇచ్చారు. ముల్లా హైబతుల్లా అఖుంద్ జాదా కనుసన్నల్లోనే ప్రధాని మంత్రి లేదా అధ్యక్షుడు ప్రభుత్వాన్ని పాలిస్తారని తాలిబన్లు తెలిపారు.
అయితే రాబోయే తాలిబన్ల సర్కార్ లో అధ్యక్షడితో పాటు ప్రధాని మంత్రి కూడా ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు.
Also Read: Ahmad Massoud Profile: మసూద్.. 'పంజ్‌షీర్' కా బాద్ షా.. ఈ పేరు వింటేనే తాలిబన్లకు హడల్!
బరాదర్ అధ్యక్షుడిగా..
రోజువారీ పరిపాలనా వ్యవహారాలను తాలిబన్ల రాజకీయ విభాగపు అగ్ర నేత అబ్దుల్ ఘనీ బరాదర్ నాయకత్వంలోని ప్రత్యేక మండలి చూసుకునే అవకాశముంది. ఈ మండలికి అధినాయకుడిగా తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్ జాదా ఉంటారు. ఆయన కనుసన్నల్లోనే తాము నడుచుకుంటామని తాలిబన్లు తెలిపారు. అఖుంద్‌జాదా ప్రస్తుతం కాందహార్‌లో ఉన్నారు. ఆయన, బరాదర్ త్వరలోనే కాబుల్‌లో బహిరంగంగా కనిపించే అవకాశాలున్నాయి.
Also Read: Al Qaeda on Taliban: తాలిబన్లకు అల్ ఖైదా అభినందనలు.. 'కశ్మీర్'పై కీలక వ్యాఖ్యలు
తాలిబన్ల కవాతు..
అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం వెళ్లిపోవడంతో తాలిబన్ల ఉత్సాహానికి అంతులేకుండా పోయింది. అమెరికా వదిలి వెళ్లిన రక్షణ సామగ్రి, అఫ్గాన్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను కాందహార్‌లో బుధవారం బహిరంగంగా ప్రదర్శించారు. వాటితో కవాతు నిర్వహించారు. హమ్వీ వాహనాలు, బ్లాక్ హాక్ హెలికాప్టర్ వంటివి ఇందులో కనిపించాయి.
Also Read: Afghanistan news : ఫేక్.. తాలిబన్లు ఉరి తీసి హెలికాఫ్టర్‌లో వేలాడతీయలేదు ! అక్కడ అసలు జరిగింది ఇదే..
అఫ్గానిస్థాన్ సంక్షోభంపై ప్రత్యేక కథనాలు ఇక్కడ చూడండి..