Pavan Kalyan Birthday: చూడప్ప సిద్దప్ప.. పవర్ స్టార్ చెప్పిన ఈ డైలాగులు చదివితే.. ఆ కిక్కే వేరప్పా!
ఒకరు నచ్చలేదు అని చెప్పడానికి వెయ్యి కారణాలు చెప్పొచ్చు. కాని నచ్చారని చెప్పడానికి కారణాలేం చెప్పలేం. నచ్చారు అంతే – సుస్వాగతం
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనేను టైంకి రావడం కాదు మిత్రమా… నేను వచ్చాకే టైం వస్తుంది ..కొన్నిసార్లు రావడం లేట్ అవ్వొచ్చు కాని… రావడం మాత్రం పక్కా – గోపాల గోపాల
ఏయ్ … నువ్వు నందా అయితే… నేను బద్రి.. బద్రీనాథ్.. అయితే ఏంటి? – బద్రి
మీరు గుడుంబ సత్తి కావొచ్చు తొక్కలో సత్తి కావొచ్చు… బట్ ఐ డోంట్ కేర్..బికాజ్ ఐ యామ్ సిద్దు..సిద్దార్థ్ రాయ్ – ఖుషీ
గీతలో శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడో తెలుసా… పని పూర్తయ్యే వరకు ఒరిజినల్స్.. డూప్లికేట్స్ ఇవ్వద్దు అన్నాడు నాయనా! – గుడుంబా శంకర్
జీవితంలో దేనినైనా నాశనం చేయడం చాలా తేలిక. సృష్టించడం చాలా కష్టం. సృష్టించడం తెలియని వాళ్ళకి నాశనం చేసే హక్కు లేదు . – బాలు
యుద్ధంలో గెలవడమంటే శత్రువుని చంపడం కాదు.. శత్రువుని ఓడించడం.. శత్రువుని ఓడించటమే యుద్ధం ఒక్క లక్ష్యం – జల్సా
కర్తవ్యమే దేవాలయం, కర్తవ్యమే చర్చ్, కర్తవ్యమే మసీద్, కర్తవ్య దర్మన్నిసరిగ్గ పాటిస్తే మీరె దేవుళ్ళు.-కొమరం పులి
కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం… అలాంటివాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే – తీన్ మార్
నాకొంచెం తిక్కుంది.. కాని దానికో లెక్కుంది. – గబ్బర్ సింగ్
నాకు తిక్కలేస్తే.. చీమైనా ఒక్కటే.. సీఎం అయినా ఒక్కటే – కెమెరామెన్ గంగతో రాంబాబు
చూడప్ప సిద్దప్ప… నేనొక మాట చెప్తాను.. పనికొస్తే ఈడ్నే వాడుకో.. లేదంటే ఏడనైనా వాడుకో.. నేను సింహాలాంటోడినప్ప .. అది గడ్డం గీసుకోలేదు!! నేను గీసుకోగలను.. అంతే తేడా!! మిగతాదంతా సేమ్ టు సేమ్.. అయినా లాస్ట్ పంచ్ మనదైతే దానికొచ్చే కిక్కే వేరప్పా. – అత్తారింటికి దారేది
ఒక్కడినే… ఒక్కడినే…ఎంతదూరం వెళ్ళాలన్న ముందడుగు ఒక్కటే! ఎంతమంది మోసే చరిత్రైనా రాసేది ఒక్కడే! ఎక్కడికైనా వస్తా.. జనంలో ఉంటా.. జనంలా ఉంటా… – సర్దార్ గబ్బర్ సింగ్
రేయ్.. కోపాన్ని, ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకో… – కాటమరాయుడు
ఇది మనం కూర్చునే కుర్చీ.. పచ్చని చెట్టుని గొడ్డలితో పడగొట్టి, రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి, బెరడుని బ్లేడుతో సానబెట్టి, ఒళ్ళంతా మేకులు కొట్టి కొట్టి తయారుచేస్తారు. ఎంతో హింస దాగుంది కదా! జీవితంలో మనం కోరుకునే సౌకర్యం వెనుక ఒక మినీ యుద్ధమే ఉంటుంది. – అజ్ఞాతవాసి
కోర్టులో వాదించడమూ వచ్చు..కోటు తీసి కొట్టడమూ వచ్చు-వకీల్ సాబ్