తన ఇమేజ్ కు సరిపోతుందని అనిపిస్తే చాలు, ఏ మూవీ రీమేక్ చేసేందుకైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ మొదలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న అయ్యప్పనుమ్ కోషియం వరకూ రీమేక్ చేసిన మూవీస్ అన్నీ హిట్టే. ఇక్కడితో ఈ పర్వం ఆగిపోలేదు...ఇంకా ‘డ్రైవింగ్ లైసెన్స్, విక్రమ్ వేదా కూడా పవన్ రీమేక్ లిస్టులో ఉన్నాయి. ప్రసుతం సెట్స్ మీదున్న అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ కి ఫస్ట్ రానా, రవితేజ పేర్లు వినిపించాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్-రానా ఫైనలయ్యారు. రీసెంట్ గా రిలీజైన భీమ్లానాయక్ ఫస్ట్ గ్లింప్ల్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది.




Also Read: ఖాకీ వదిలి లుంగీతో పవన్‌ కల్యాణ్ రచ్చ.. క్యాప్షన్‌ అక్కర్లేదంటూ రానాకు వార్నింగ్


పవర్ స్టార్ కి రీమేక్స్ కొత్తేం కాదు. ఓ రకంగా చెప్పాలంటే పవన్ కెరీర్ బిల్డైందే రీమేక్స్ పై. రీమేక్ హిట్స్ తో పోల్చుకుంటే స్ట్రైట్ హిట్స్ తక్కువే అనిచెప్పాలి. ఆల్రెడీ హిట్టైన కథలకు రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ కాబట్టి చాలామంది హీరోలు రీమేక్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. కానీ అందరికీ రీమేక్స్ కలసొస్తాయని చెప్పేలేం. ఎందుకంటే అప్పట్లో ఇతర భాషల్లో హిట్టైన సినిమాలు రీమేక్ చేసినా.. తెలుగు వారంతా రీమేక్ మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు ఎంటర్‌టైన్మెంట్ పరిధి పెరిగింది. ఓటీటీల ట్రెండ్ మొదలయ్యాక మరీ జోరందుకుంది. దీంతో ఏదైనా మూవీ రీమేక్ చేస్తున్నారంటే ముందే ఒరిజనల్ మూవీ చూసేస్తున్నారు. ఫస్ట్ లుక్  కంపేరజన్స్ కూడా మొదలైపోతున్నాయి. యాజటీజ్‌గా రీమేక్ చేస్తే మక్కికి మక్కీ దించేస్తున్నారని, మార్చితే అసలు సినిమాని చెడగొట్టారని హడావుడి చేస్తున్నారు. ఈ లెక్కన రీమేక్ సినిమా తీసి మెప్పించడం అంత సులువేం కాదన్నది సినీ వర్గాల అభిప్రాయం. కానీ లక్కు కలిసొచ్చిందనుకోవాలో ఏమో, ఆరంభంలో సినిమాలు పక్కనపెడితే, గబ్బర్ సింగ్ నుంచి వకీల్ సాబ్ రీసెంట్‌గా రిలీజైన భీమ్లానాయక్ ఫస్ట్‌ గ్లింప్స్‌  వరకూ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి.




గబ్బర్ సింగ్: 2008 లో జల్సా హిట్ తర్వాత వరుసగా మూడేళ్ల పాటూ పవన్‌కు హిట్ లేదు. కెరీర్ డల్ అయిందా ఏంటనే విమర్శలు వెల్లువెత్తిన సమయంలో 2012లో  గబ్బర్ సింగ్ వచ్చింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ ‘దబాంగ్’ తెలుగు రీమేక్ గబ్బర్ సింగ్. అప్పటికే ఐరెన్ లెగ్ హీరోయిన్ అని ముద్రపడిన శృతిహాసన్ ఇందులో హీరోయిన్.  ఫ్లాపుల్లో ఉన్న పవన్, ఐరెన్ లెగ్ శ్రుతి హాసన్ కలిస్తే మూవీ ఏమవుతుందో అన్న ట్రోల్స్‌కు చెక్ పెడుతూ ఆ చిత్రం సూపర్ హిట్టైంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్‌కు మాంచి హిట్టివ్వగా.. శృతి హాసన్‌కు ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ లైన్ పోయి..  గోల్డెన్ లెగ్‌గా మారింది.


Also Read: ఇష్క్‌బాయ్‌ని బెదిరిస్తోన్న మిల్కీ బ్యూటీ.. చూపులతో కాదు తుపాకీతో..


గోపాల గోపాల: గబ్బర్ సింగ్ తర్వాత రీమేక్ మూవీ గోపాల గోపాల. మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన గోపాల గోపాల బాలీవుడ్ మూవీ ఓ మై గాడ్ కి రీమేక్. 2012 హిందీలో స్టార్ హీరో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘ఓ మై గాడ్’. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్‏గా విడుదలై ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇందులో నాస్తికుడిగా పరేష్, దేవుడిగా అక్షయ్ కుమార్...తెలుగులో వెంకటేశ్-పవన్ కళ్యాణ్ నటించారు. పవన్ కళ్యాణ్ కృష్ణుడు పాత్రలో నటిస్తాడా...అస్సలు స్యూట్ కాదన్నారంతా. కానీ వెంకీ-పవన్...నాస్తికుడు-భగవంతుడి పాత్రలతో మెప్పించారు.


కాటమరాయుడు: పవన్ కళ్యాణ్ కెరీర్ లో కాటమరాయుడు సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తమిళ్ వీరం కి రీమేక్. తమిళ్ వీరం లో అజిత్ హీరో గా నటించాడు. తమిళ వీరం సినిమా అప్పటికే తెలుగులో డబ్బింగ్ చేసి బుల్లితెరపై కూడా ప్లే అయింది. దీంతో కాటమరాయుడు కథలో ఏం కొత్తదనం కనిపించలేదు ప్రేక్షకులకి.


Also read: స్టార్ హీరోలా..అయినా తగ్గేదేలే అంటున్న లీకువీరులు..సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ పెద్దలు




కమ్ బ్యాక్ కూడా రిమేకే: కాటమరాయుడు తర్వాత అజ్ఞాతవాసితో మరో డిజాస్టర్ అందుకున్న పవన్...పొలిటికల్ ఎంట్రీతో మరో మూడేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ కూడా రీమేక్ కావడం విశేషం. బాలీవుడ్ పింక్ రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ తో గ్రాండ్ కమ్ బ్యాక్ అనిపించాడు. పవన్ ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి విడుదల చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.  కరోనా టైం లో కూడా వకీల్ సాబ్ కు బాగానే ఓపెనింగ్స్ వచ్చాయంటే అదీ పవన్ క్రేజ్ అంటారు ఫ్యాన్స్.



అయ్యప్పనుమ్ కోషియుమ్ కూడా..: ఈ ఏడాది మలయాళ ఇండస్డ్రీలో సంచలనం సృష్టించిన యాక్షన్ థ్రిల్లర్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’. సిన్సియర్ పోలీసాఫీర్ అయ్యప్పన్ కు, మాజీ హవాల్దార్ కోషికి మధ్య తలెత్తిన ఒక వివాదం .. ఇద్దరి ఇగోల్ని బాగా దెబ్బతీస్తుంది. అందుకే ఎవరికి వారు అవతలివారికి బుద్ధి చెప్పాలని ట్రై చేస్తుంటారు. ఈ గేమ్ లో చివరికి ఎవరు పై చేయి సాధిస్తారు అన్నదే మిగతా కథ. ఇందులో అయ్యప్పన్ గా బిజు మీనన్, కోషి గా పృధ్విరాజ్ అదరగొట్టేశారు. ఈ సినిమా తెలుగు రీమేక్ లో పవన్- రానా నటిస్తున్నారు. ఇప్పటికే ‘భీమ్లా నాయక్’గా పవన్ కళ్యాణ్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్‌లోకి కూడా బాగా వెళ్లిపోయింది. దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.


Also Read: రాజ రాజ చోర, తరగతి గది దాటి, 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీరీస్ 9 సహా ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో తెలుసా....


భీమ్లానాయక్ తర్వాత.. ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్: లాస్టియర్ మలయాళంలో సంచలన విజయం సాధించిన థ్రిల్లర్ మూవీ ‘డ్రైవింగ్ లైసెన్స్’. పృధ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రను సురాజ్ వెంజారమూడ్ నటించాడు. ఒక సూపర్ స్టార్ కి, తన వీరాభిమాని అయిన వెహికల్ ఇన్స్ పెక్టర్ కి మధ్య జరిగే ఇగో క్లాష్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ సొంతం చేసుకున్నట్టు ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో సూపర్ స్టార్ పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తే .. సినిమా లుక్కే మారిపోతుందని రామ్ చరణ్ భావించాడట. అందుకే పవన్ కళ్యాణ్ ను ఇందులో హీరోగా నటించేందుకు ఒప్పించాడట. అతి త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్ మెంట్ రాబోతోంది.


Also Read: ప్రకాశ్ రాజ్ సంచలనాల ట్వీట్.. ఇండస్ట్రీలో తీవ్రస్థాయిలో చర్చ..


‘విక్రమ్ వేదా’ రీమేక్ లో పవన్, రవితేజ?: మూడేళ్ళ క్రితం తమిళంలో సూపర్ హిట్టైన యాక్షన్ మూవీ ‘విక్రమ్ వేదా’. విజయ్ సేతుపతి , మాధవన్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు గాయత్రి, పుష్కర్ దంపతులు దర్శకత్వం వహించారు. ఒక గ్యాంగ్ స్టర్ కి, ఓ పోలీసాఫసర్ కు మధ్య జరిగే టగ్ ఆఫ్ వార్ గా ఈ సినిమా తెరకెక్కింది. అప్పటి నుంచి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చాలా మంది ట్రై చేశారు. కానీ హీరోల్ని ఎంపికచేయడం సమస్యగా మారింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం పవర్ స్టార్ ను, రవితేజను ఎంపికచేశారట. ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి కూడా త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.


Also Read: షాకింగ్.. ‘బిగ్‌బాస్’ నుంచి ఆ సింగర్, యాంకర్ ఔట్! ఎందుకిలా చేశారు?


రెండో సినిమాతోనే రీమేక్స్ మొదలు..: పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమా డీసెంట్ హిట్ అయింది. ఆ తరువాతే గోకులంలో సీత వచ్చింది. ఇది కూడా హిట్టైంది. ఈ సినిమా ను తమిళ నట గోకులత్తిల్ సీతాయ్ నుంచి రీమేక్ చేసారు. సుస్వాగతం సినిమాని  తమిళ సినిమా లవ్ టుడే నుంచి ఈ సినిమా ను రీమేక్ చేసారు. ఖుషి పవన్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా. అప్పటి రికార్డ్స్ అన్నిటిని ఖుషి తిరగరాసింది. ఇది తమిళ్ ఖుషి సినిమా నుంచి రీమేక్ చేశారు. తమిళ సినిమా తిరుపచ్చి ని తెలుగు లో అన్నవరం గా రీమేక్ చేసారు. తమిళ తిరుపచ్చి లో హీరో విజయ్ నటించారు. ఈ సినిమా తెలుగు లో మాత్రం ఫ్లాప్ అయింది. హిందీ సినిమా లవ్ ఆజ్ కల్ ను తెలుగు లో తీన్ మార్ గా రీమేక్ చేసారు. పవన్, త్రిష ఈ సినిమాలో నటించారు.


రీమేక్స్ లో కొన్ని సూపర్ హిట్టై. రెండు మూడు సినిమాలు నిరాశపర్చినా పవన్ క్రేజ్ పెరిగిందే కానీ తగ్గలేదు.  మరి అయ్యప్పనుమ్ కోషియం, దీని తర్వాత లిస్టులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, విక్రమ్ వేదా రిజల్ట్స్ ఎలా ఉంటాయో వెయిట్ అండ్ సీ.


Also Read: వెంకటేష్ సినీ జర్నీకి 35 ఏళ్లు.. అద్భుతమైన వీడియోను షేర్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్