‘జెండా’ ఎగరేస్తాం... ఇప్పుడు ఈ ట్వీట్‌పై పెద్ద చర్చే జరుగుతోంది. ఇటీవల ధనుష్ తమిళ మూవీ షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో పొరపాటున జారిపడటంతో ప్రకాశ్ రాజ్ భుజానికి గాయమైంది. చేతి ఎముక చిట్లడంతో హుటాహుటిన హైదరాబాద్ వచ్చి డాక్టర్ గురవారెడ్డి సమక్షంలో ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం  ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.


ఆగస్ట్ 15 సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అవకాశం ఉన్నవాళ్ళంతా జెండా ఎగరేస్తారు లేదా ఎవరైనా ఎగరేసిన జాతీయ జెండాకు వందనం చేస్తారు. తాజాగా ప్రకాశ్ రాజ్ ‘జెండా’ ఎగరేస్తాం అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఫిల్మ్ నగర్ లో కొత్త చర్చకు దారితీసింది. ఆగస్ట్ 15ని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టారా... లేదా... త్వరలో జరగబోతున్న మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో తాము జెండా ఎగరేస్తామని ఇలా అన్నారా అనే చర్చ ఊపందుకుంది.


Also Read: 'మంచు విష్ణుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి''.. 'మా' సభ్యుల కామెంట్స్..


 



 మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు అంటే ఒకప్పుడు జెంటిల్మన్ అసోసియేషన్‌ అనేవాళ్లు. అంటే అంతా కలిసికట్టుగా ఉండి ఒకర్ని అధ్యక్షుడిగా ఎన్నకునేవాళ్లు. లేదంటే పెద్దలు చెప్పిన వాళ్లకే ఓటేసేవాళ్లు. కానీ పరిస్థితులు మారిపోయాయి. అందులోనూ రాజకీయం వేలు పెట్టింది. ముఖ్యంగా గత రెండు పర్యాయాలుగా ఆ సంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. ఇవి కూడా సార్వత్రిక ఎన్నికల్లా మారిపోయాయా అనే సినీ పరిశ్రమ వర్గాలే అనుమాన పడుతున్నాయి. ఒకరినొకరు తిట్టుకోవడాలు.. అరుచుకోవడాలు షరా మామూలైపోయాయి. ఈసారి ఏకంగా చిరంజీవి వర్సెస్ మోహన్‌బాబు అన్నట్టు పరిస్థితి మారిపోయింది.


ఇండస్ట్రీకి పెద్దగా దాస‌రి నారాయణరావు ఉన్న‌ప్పుడు ఆయ‌న మాట చెల్లుబాటు అయ్యేది. అప్పుడు ‘మా’లో లుకలుకలు లేకుండా ఎన్నిక‌లు ఏక‌గ్రీవంగానే సాగాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా మంచు విష్ణు నిలబడుతున్నాడు. ప్రకాశ్ రాజ్‌కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉందని నాగబాబు మాటల్లోనే అర్థమైపోయింది. మరి మంచు విష్ణు కూడా తగ్గేదెలె అంటున్నారు. కొందరు సినీ పెద్దలు కూడా విష్ణువైపు ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆయన్ని గెలిపించుకుందామని ఇప్పుడున్న కార్యవర్గంలో కొందరు సభ్యులు బహిరంగంగానే పిలుపునిస్తున్నారు. 


మరోవైపు నరేష్‌, హేమ మధ్య ఓ చిన్న సైజ్‌ వరల్డ్ వార్‌ జరుగుతోంది. ఇలాంటి టైంలో ప్రకాశ్‌ రాజ్ చేసిన ట్వీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. జెండా ఎగరేస్తాం అంటూ ఈ మోనార్క్ చేసిన ట్వీట్‌ అందర్నీ ఆలోచనలో పడేసింది. ఇంతకీ ఆగస్టు 15 రోజున ఎగిరే జెండా కోసమా... రాబోయే మా ఎన్నికల్లో ఎగిరే జెండా కోసమా అన్న డిస్కషన్ నడుస్తోంది. 


''మా'' సభ్యులు కొందుర ప్రెస్‌మీట్ పెట్టి మరీ మంచు విష్ణుకు సపోర్టివ్‌గా మాట్లాడారు. మంచు విష్ణును ఏకగ్రీవంగా గెలిపించుకోవాలని సినీ పరిశ్రమలోని వారందరికీ సూచనలు కూడా చేశారు. తాను వెనుకబడిపోయానని అనుకున్నారో లేదో కానీ... సాయంత్రానికి ప్రకాశ్ రాజ్ బాంబు పేల్చారు. "మా" సభ్యులు అరగంటపాటు చెప్పింది...ప్రకాశ్‌ రాజ్‌ ఒక్క ట్వీట్‌తో కొట్టేశారు. జెండా ఎగరేస్తామన్న ఒక్క మాటతో వంద డిస్కషన్లు జరిగేలా ట్వీట్ చేసి ఇంట్లో కూల్‌గా కూర్చున్నారు. 


Also Read: ''పాగల్''.. ఇదొక పిచ్చి ప్రేమ కథ..