దాదాపు రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్.. ‘వకీల్ సాబ్’ మూవీతో టాలీవుడ్‌లో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్, రానాతో కలిసి ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చేసింది.

  


మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేస్తున్నారు. ఈ రోజు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా టైటిల్‌తో పాటు టీజర్‌ను విడుదల చేసారు. అందరు అనుకున్నట్టుగానే ఈ సినిమాకు ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.


ఇప్పటికే ‘భీమ్లా నాయక్’గా పవన్ కళ్యాణ్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్‌లోకి కూడా బాగా వెళ్లిపోయింది. దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ చేశారు. దాంతో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు.


అసలు సినిమా కథాంశం ఎలా ఉంటుంది? అన్నదానికి సింబాలిక్ గా ఉందీ థీమ్డ్ ఆడియో. లాలా.. భీమ్లా.. అడవి పులి.. గొడవ పడి.. ఒడిసిపట్టు.. పిచ్చి కొట్టు.. అంటూ థీమ్ ని ఎలివేట్ చేసిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది. ఇందులో పవన్ కల్యాణ్ కోపంతో అరుపు వినిపిస్తోంది. ఏయ్ డేనీ..బయటికి రారా నా  కొXXXక.. రేయ్ రేయ్ రేయ్ రా..! అంటూ కాస్త ఘాటైన పదజాలమే వాడారు. ఇది ఒరిజినల్ లోని అయ్యప్పన్ పాత్ర..


భీమ్లానాయక్‌ ఫస్ట్‌ గ్లింప్స్‌:



డేనియల్.. డేనియల్ సీజర్ .. బీమ్లా బీమ్లా నాయక్.. ఏం చూస్తున్నావ్ కింద క్యాప్షన్ లేదనా? అక్కర్లేదుగా .. ఎక్కు బండెక్కు.. అంటూ రానా వాయిస్ ఆద్యంతం ఆసక్తిని కలిగించింది. ఇందులో కోషియం పాత్రలో రానా నటిస్తున్నారని అర్థమవుతోంది. అయితే తెలుగు వెర్షన్ లో భీమ్లా నాయక్ .. రానా పేరు డేనియల్ అని అర్థమవుతోంది. ఒరిజినల్ లో రానా పాత్రను బిజు మీనన్ చేయగా... బీమ్లా నాయక్ పాత్రను పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించారు. గోవా టూర్ వెళుతున్న నాయక్ దారి తప్పాక లిక్కర్ తో పోలీసులకు చిక్కాక ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా సింగిల్ లైన్. మార్గమధ్యంలో పోలీస్ తో నాయక్ గొడవ ఏంటన్నదే కథ.


సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్,  రానాకు జోడిగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ .. భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ సినిమా కూడా త్వరలో షూటింగ్ రీ స్టార్ట్ చేయనుంది. ఏ యం రత్నం  నిర్మాత. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో అప్పీల్ కావడంతో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్రబృందం. మరోవైపు రానా హీరోగా నటించిన ‘విరాట పర్వం’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారా లేదా థియేటర్స్‌లో విడుదల చేస్తారా అనే విషయమై సందిగ్థం నెలకొంది.