‘దియా’.. మీలో చాలామంది ఈ సినిమా గురించి వినే ఉంటారు. కన్నడలో విడుదలై మంచి హిట్ అందుకున్న ఈ చిత్రాన్ని చాలామంది తెలుగులో డబ్ చేయాలంటూ యూట్యూబ్ తదితర సోషల్ మీడియాలో వేదికలపై కోరేవారు. మొత్తానికి వారి ఆశ ఫలించింది. ‘దియా’ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇప్పటికే యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో 42వ స్థానంలో ట్రెండవ్వుతోంది. 


ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి పెట్టాలంటూ కొన్ని నెలలుగా నెటిజనులు కోరుతున్న సంగతి తెలిసిందే. నిర్మాతలు వారి మొర అలకించారో ఏమో.. మొత్తానికి ట్రైలర్ వదిలి గుడ్ న్యూస్ చెప్పారు. కె.ఎస్.ఎస్ అశోక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథనం యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ‘దియా’ పాత్ర ఈ సినిమాకే హైలెట్. ఇందులో భావోద్వేగ సన్నివేశాలను చూస్తే కంటతడి పెట్టకుండా ఉండలేరు. గుండె బరువెక్కిచే సీన్స్‌ను ఈ చిత్రాలో చాలానే ఉన్నాయి. 


నిర్మాత బీఏ రాజు టీమ్ చిత్రం విడుదల తేదీ వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆగస్టు 16న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆగస్టు 19 నుంచి డిజిటల్ స్ట్రీమ్ (యూట్యూబ్) కానుందని ప్రకటించారు. శ్రీ స్వర్ణలత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.కృష్ణ చైతన్య సమర్పించిన ఈ చిత్రానికి బి.అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కన్నడంలో ఆర్కే నల్లమ్, రవి కాశ్యప్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఖుషీ, పృథ్వీ అంబార్, దీక్షిత్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. 


ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. రైలు పట్టాలపై ఆత్మహత్యతో ట్రైలర్ మొదలైంది. తర్వాతి సీన్‌లో తను ప్రేమించిన అబ్బాయి చనిపోయాడనే వార్తతో దియా భావోద్వేగానికి గురవ్వుతున్న సన్నివేశాలు.. లవ్ సీన్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. ‘లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్‌ప్రైజెస్’ అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ‘దియా’ తెలుగు ట్రైలర్‌ను మీరు కూడా చూసేయండి. 


‘దియా’ ట్రైలర్:


Also Read: జిమ్‌లో మెగాస్టార్‌‌తో ప్రకాష్ రాజ్ ‘చిరు’ మంతనాలు.. ‘మా’లో కాకరేపుతున్న ట్వీట్


Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?


Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!