తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET) ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈసెట్ ఫలితాలను బుధవారం (ఆగస్టు 18న) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు జేఎన్టీయూ హైదరాబాద్ ప్రకటించింది. విద్యార్థులు తమ ర్యాంకు కార్డులను ecet.tsche.ac.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి.పాపిరెడ్డి వెల్లడించారు. కాగా, పాలిటెక్నిక్ అభ్యర్థులు ఇంజనీరింగ్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 3వ తేదీన టీఎస్ ఈసెట్- 2021 పరీక్షను నిర్వహించారు.
టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..
తెలంగాణ ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు చేశారు. దీని ప్రకారం ఈ నెల 24 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాలి. 26వ తేదీ నుంచి 29 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. వెబ్ ఆప్షన్లు నమోదు ప్రక్రియ ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు ఉంటుంది. సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 2వ తేదీన జరుగుతుంది. సెప్టెంబరు 2 నుంచి 7వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
Also Read: AP LPCET 2021: ఏపీలో లాంగ్వేజ్ పండిట్ కోర్సు ప్రవేశాలు.. ఎల్‌పీసెట్ నోటిఫికేషన్ విడుదల..
సెప్టెంబర్ 13 నుంచి తుది విడత..
ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్ తేదీలను కూడా ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి తుది విడత కౌన్సెలింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ 14వ తేదీన ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 17న సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ వెల్లడించారు. సెప్టెంబర్ 18వ తేదీన స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలను మరిన్ని వివరాల కోసం https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
Also Read: TS Eamcet counselling: 30 నుంచి టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
Also Reda: TS DEECET 2021: తెలంగాణ డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదల.. వచ్చే నెల 8న ఎగ్జామ్