ఆంధ్రప్రదేశ్‌లో లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎల్‌పీసెట్ (లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ LPCET) నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 18 నుంచి సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎల్‌పీసెట్ కన్వీనర్ అధికారిక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
సెప్టెంబర్ 25న పరీక్ష..
తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో పండిట్ కోర్సుల ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్షను (సీబీటీ) సెప్టెంబర్ 25వ తేదీన నిర్వహించనున్నారు. దరఖాస్తు పీజు కింద అభ్యర్థులు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. 2021 జూలై 1 నాటికి 19 ఏళ్లు పూర్తయిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ కోర్సులకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి లేదు.
ఎల్‌పీసెట్ ద్వారా ఏపీలోని గవర్నమెంట్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పండిట్ కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పండిట్ ట్రైనింగ్ కాలేజీల్లో లాంగ్వేజ్ పండిట్ కోర్సులలో (LPT) ప్రవేశాలు కల్పించనున్నారు. నోటిఫికేషన్ సహా మరిన్ని వివరాల కోసం https://aplpcet.apcfss.in, వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
Also Read: UPSC Exam Calendar: యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్.. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు ఎప్పుడంటే?
విద్యార్హత వివరాలు..
- తెలుగు పండిట్: బీఏ (తెలుగు లిటరేచర్)/ బీఏ (ఓరియంటల్ లాంగ్వేజ్ తెలుగు)/ బీఓఎల్ ఇన్ తెలుగు/ బ్యాచిలర్ డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్టుగా తెలుగు/ ఎంఏ తెలుగు కోర్సుల్లో పాసైన వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
- హిందీ పండిట్: బీఓఎల్ ఇన్ హిందీ/ బ్యాచిలర్ డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్టుగా హిందీ/ ప్రవీణ ఆఫ్ దీక్షిత భారత్ హిందీ ప్రచార సభ/ విద్వాన్ ఆఫ్ హిందీ ప్రచార సభ, హైదరాబాద్/ ఎంఏ హిందీ ప్రవేశ పరీక్షల్లో క్వాలిఫై అయిన లేదా కోర్సు పూర్తి చేసిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఉర్దూ పండిట్: బీఏ (ఉర్దూ లిటరేచర్) /బీఏ (ఓరియంటల్ లాంగ్వేజ్ ఉర్దూ)/ బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఉర్దూ / గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్టుగా ఉర్దూ చదివిన వారు/ ఎంఏ ఉర్దూ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం..
కామన్ ఎంట్రన్స్ పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టనున్నారు. మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం గంటన్నరగా (90 నిమిషాలు) ఉంది. మొత్తం నాలుగు విభాగాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పార్ట్ 1లో కరెంట్ ఎఫైర్స్‌కు సంబంధించిన 20 ప్రశ్నలు, రెండో విభాగంలో న్యూమరికల్ ఎబులిటీ 10 ప్రశ్నలు, మూడో విభాగంలో లాంగ్వేజ్‌కు సంబంధించిన 30 ప్రశ్నలు, నాలుగో విభాగంలో లిటరేచర్‌కు సంబంధించిన 40 ప్రశ్నలు ఉంటాయి.
Also Read: BRAOU Admissions: అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు..