హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో (Ambedkar Open University) డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువును వర్సిటీ పొడిగించింది. 2021 సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ జూన్ నెలలో తెలిపింది. వీటి ప్రవేశ గడువు ఆగస్టు 12వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రవేశ గడువును ఆగస్టు 27వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. 


Also Read: TS ECET Counselling: టీఎస్‌ ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. వెబ్ ఆప్షన్ల తేదీలు, పూర్తి వివరాలు


ఈ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు.. పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తుంది. 


విద్యార్హత విషయానికి వస్తే.. అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్ / ఐటీఐలో పాస్ అయి ఉండాలి. బీఏ, బీకాం, బీఎస్సీ - తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ - ఉర్దూ మీడియంలలో ఉన్నాయి. పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు. ఇవి కూడా తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఉన్నాయి. 


Also Read: TS CPGET 2021: ఒకే పరీక్షతో ఏడు వర్సిటీల్లో ప్రవేశాలు.. సీపీజీఈటీ నోటిఫికేషన్‌ విడుదల.. అప్లై చేసేటప్పుడు వీటిని మర్చిపోవద్దు


ట్యూషన్ ఫీజు చెల్లింపులు సైతం 27 వరకు..
2021-22 విద్యా సంవత్సరంలో ఫస్టియర్‌లో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులు సెకండియర్‌ ట్యూషన్‌ ఫీజును, అంతకుముందు చేరిన విద్యార్థుల్లో సకాలంలో చెల్లించలేకపోయిన వారు ఆగస్టు 27వ తేదీలోగా ట్యూషన్ ఫీజు చెల్లించాలని వర్సిటీ తెలిపింది. ఇంతకుముందు వెల్లడించిన నోటిఫికేషన్ ప్రకారం ట్యూషన్ ఫీజు గడువు కూడా ఆగస్టు 12 వరకే ఉంది. గడువు ముగియనున్న నేపథ్యంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ట్యూషన్ ఫీజు చెల్లింపులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://www.braouonline.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 


Also Read: School Reopen: తెలంగాణలో స్కూళ్ల రీఓపెన్ ఎప్పుడు? విద్యా శాఖ ఏం చెప్పిందంటే.. మరి సర్కార్ ఒప్పుకుంటుందా?


Also read: CBSE Class 10, 12 Result Update: ఈ నెల 25 నుంచి సీబీఎస్ఈ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు.. ఇవే పూర్తి వివరాలు