స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన వెలుగు వాట్సాప్ గ్రూపులో నీలి వీడియో పోస్టు కలకలం రేపింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు సమాచారాన్ని అందించేందుకు గ్రామ సమాఖ్యల పర్యవేక్షకుల ఏర్పాటు చేసిన ఓ గ్రూపులో అభ్యంతరకర పోస్టు అయింది. కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలో ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గ్రూపులోని మహిళలు ఆ వీడియోపై అభ్యంతరం తెలిపారు. ఈ వీడియోను వెలుగు ఏపీఎం బాలసుబ్రహ్మణ్యం పోస్టు చేయడంతో మరింత చర్చకు దారితీసింది.


తన నంబరు నుంచి వీడియో పోస్టు కావడంపై ఏపీఎం బాలసుబ్రహ్మణ్యం అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. తనకు ఎవరో పంపిన వీడియో పొరపాటున ఆ గ్రూపులో పోస్టు చేసినట్లు చెప్పారు. ఈ విషయంలో తన తప్పు ఏంలేదన్నారు. అయినప్పటికీ కొందరు కావాలనే తనను అప్రతిష్ఠ పాలుచేసేందుకు వీడియోను ఇతరులకు పంపి రాద్ధాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో పోస్టు అయినందుకు గ్రూపు సభ్యులుకు నేరుగా క్షమాపణలు చెప్పానని బాలసుబ్రహ్మణ్యం అన్నారు.


Also Read: Bachpan Ka Pyaar : యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ర్యాపర్ బాద్ షా సాంగ్..


పొరపాటున పోస్టు అయ్యింది : వెలుగు అధికారి


స్వయం సహాయక సంఘాలకు సమాచారాన్ని అందించే గ్రామ సమాఖ్యల పర్యవేక్షకుల వాట్సాప్‌ గ్రూపులో బుధవారం రాత్రి పోస్టు అయిన ఓ వీడియోపై మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ గ్రూపులో దాదాపుగా అందరూ మహిళలే ఉంటారు. తమ విధులకు సంబంధించిన సమాచారమని ఆ వీడియో చూశామన్నారు. కానీ అది నీలివీడియో అవ్వడంతో  వారు షాకయ్యారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. పొరబాటున నీలి వీడియోను గ్రూపులో పంపినట్లు సదరు వెలుగు అధికారి సహచరులకు గ్రూపులో వెంటనే క్షమాపణ చెప్పారు. బుధవారం రాత్రి ఓ అత్యవసర సమాచారాన్ని గ్రామ సమాఖ్యలకు పంపుతున్నప్పుడు తనకు ఎవరో పంపిన వీడియో పొరబాటున వెలుగు గ్రూపులో పోస్టు అయ్యిందని ఏపీఎం బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ ఘటనపై గ్రూపులోని మహిళలకు తాను నేరుగా క్షమాపణ సైతం చెప్పినట్లు తెలిపారు. కానీ ఈ అంశాన్ని కావాలని పెద్దది చేసి తనను అపఖ్యాతి చేసేలా కొందరు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వాపోయారు. 


Also Read: Huzurabad Byelection late : ఎంత లేటయితే అంత ఎక్కువ ఖర్చు..! హుజూరాబాద్‌పై రాజకీయ పార్టీల్లో ఆందోళన !