భారత్‌లో గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా పుంజుకున్నాయి. కాస్త డిమాండ్ రావడంతో ఆగస్టు 13న బంగారం ధర రూ.310 మేర పెరిగింది. అంతకుముందు వరుసగా మూడు రోజులపాటు తగ్గిన బంగారం ధరలు, రెండు రోజులు నిలకడగా ఉన్నాయి.  దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ఇవాళ (ఆగస్టు 13)న రూ.45,7500 కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా తాజాగా రూ.49,910 గా ఉంది. గత వారం రోజులతో పోలిస్తే బంగారం ధర భారీగా పతనమైంది.


భారత మార్కెట్‌లో బంగారం ధరలు రెండు రోజుల తరువాత పెరగగా, వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. 10 గ్రాములకు రూ.2 చొప్పున తగ్గగా.. కేజీ వెండికి రూ.200 వరకూ ధర దిగొచ్చింది. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.62,300 అయింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.400 మేర తగ్గింది. నేటి ధర రూ.67,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 13న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.


ఏపీ, తెలంగాణలో పసిడి, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్‌లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.47,560 అయింది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.43,6000 గా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో స్వచ్ఛమైన వెండి ధర కిలో రూ.67,500 వద్ద మార్కెట్ అవుతోంది.


ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.260 మేర తగ్గడంతో ఆగస్టు 12న రూ.43,560 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర సైతం రూ.47,560 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. విజయవాడలో గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,600 అయింది. విజయవాడ మార్కెట్‌లో వెండి ధరలో తగ్గుదల కనిపించింది. నేడు వెండి రూ.400 మేర పతనం కావడంతో కిలో వెండి ధర రూ.67,500కి క్షీణించింది. ఇక విశాఖపట్నంలో పసిడి 22 క్యారెట్ల బంగారం ధర తగ్గడంతో రూ.43,6000 కాగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.260 మేర పెరగడంతో నేటి ధర రూ.47,560 కు చేరుకుంది. ఇక్కడ వెండి ధర కిలో రూ.67,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


దేశంలోని పలు నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఆగస్టు 12న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,540 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,540గా ఉంది. చెన్నైలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఆగస్టు 13న చెన్నైలో 22 క్యారెట్ల బంగారంపై రూ.140 మేర పెరగడంతో  ధర రూ.43,860 అయింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. 


ప్లాటినం ధరలో స్వల్ప పెరుగుదల
బంగారంతో పాటు మార్కెట్‌లో సంపన్నులు అధికంగా ఆసక్తి చూపించే మరో లోహం ప్లాటినం ధర మాత్రం ఆగస్టు 13న స్వల్పంగా పెరిగింది. గ్రాముకు రూ.30 చొప్పున పెరిగింది. దీంతో తాజా ధర రూ.2,426 అయింది. ఢిల్లీలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,260 గా ఉంది. హైదరాబాద్‌ మార్కెట్లో 10 గ్రాముల ప్లాటినం ధర నిలకడగా ఉంది. రూ.23,960 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో సైతం 10 గ్రాముల ప్లాటినం ఇదే ధరలో కొనసాగుతోంది. 


బంగారం, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ స్వల్ప మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా పలు అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా అందుకు ఓ కారణం అవుతుంది. ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు సైతం ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతుంటారు.