తెలంగాణ ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. పాలిటెక్నిక్ అభ్యర్థులు ఇంజనీరింగ్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 3వ తేదీన టీఎస్ ఈసెట్- 2021 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 24 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
ఈసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ నెల 26వ తేదీ నుంచి 29 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు ప్రక్రియ ఉంటుంది. సెప్టెంబర్ 2వ తేదీన అభ్యర్థులను సీట్లను కేటాయించనుంది. అనంతరం సెప్టెంబరు 2 నుంచి 7వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
Also Read: TS Eamcet counselling: 30 నుంచి టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
సెప్టెంబర్ 13 నుంచి తుది విడత..
ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలనకు సెప్టెంబర్ 14వ తేదీన అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్లకు సెప్టెంబర్ 14, 15 తేదీల్లో అవకాశం ఉంటుంది. సీట్ల కేటాయింపు వివరాలను సెప్టెంబరు 17న ప్రకటిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, ప్రవేశాల కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల్ వెల్లడించారు. సెప్టెంబర్ 18వ తేదీన స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.
ఏపీలో ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఈ నెల 13 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలను నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ నెల 23 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. రెగ్యులర్‌తో పాటు ఒకేషనల్ కోర్సులకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈసారి పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే ప్రవేశాలను నిర్వహిస్తామని చెప్పారు. మొదటి విడత పూర్తయ్యాక రెండో విడత ప్రవేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు.
Read More: AP Inter Admissions: ఏపీలో ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?