Vadodara: కోతిని మింగేసిన కొండ చిలువ.. జనాలు బెంబేలు

ఓ కొండ చిలువ కోతిని మింగేసింది. మింగలేక.. కక్కలేక అవస్థలు పడింది.

Continues below advertisement

కొండ చిలువ మనిషిని సైతం మింగేయగలదు. శరీరాన్ని చుట్టేసి.. పిండి చేసి వెంటనే ప్రాణాలు తీస్తుంది. దాని పట్టు నుంచి తప్పించుకోవడం ఎవరితరం కాదు. అందుకే అడవిలోని జంతువులు దానికి ఎదురెళ్లడానికే భయపడిపోతాయి. పాపం.. ఆ కోతి ఎలా చిక్కిందో ఏమో, ఓ కొండ చిలువ నోటికి చిక్కి విలవిల్లాడింది. అయితే, కొండ చిలువ దాన్ని పూర్తిగా మింగలేక.. బయటకు కక్కలేక విలవిల్లాడింది. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. 

Continues below advertisement

వడోదరకు సమీపంలోనరి వస్నా-కొటరియా గ్రామం సమీపంలోని నదీ తీరంలో 11 అడుగుల పొడవైన కొండ చిలువ కనిపించింది. దీంతో హడలిపోయిన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వన్యప్రాణి సంరక్షకుడు శైలేష్ రావల్ హుటాహుటిన అక్కడికి చేరుకుని కొండ చిలువను పట్టుకున్నారు. అయితే, అప్పటికే ఆ కొండ చిలువ ఓ కోతిని వేటాడి సగం వరకు మింగేసింది. దాన్ని పూర్తిగా మింగలేక, బయటకు కక్కలేక విలవిల్లాడుతూ కనిపించింది. దీంతో శైలేష్ దాన్ని కరేలీ‌బౌగ్‌లోని రెస్క్యూ సెంటర్‌కు తరలించారు. అనంతరం కొండచిలువ నోటి నుంచి కోతిని వెలికి తీశారు. అప్పటికే ఆ కోతి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆ కొండ చిలువను అడవుల్లో వదిలిపెట్టారు.

తాజాగా బీహార్‌లోని నలంద జిల్లాలో ఓ వ్యక్తి పాము పిల్లను కరిచి ప్రాణాలు కోల్పోయాడు. చాందీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదోదేహ్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల రమా మహతో మద్యం తాగి ఇంటి ముందు కూర్చున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన పాము పిల్ల రమాను కాటేసింది. దీంతో ఆగ్రహానికి గురైన రమా దాన్ని తోక పట్టుకుని నోట్లో పెట్టుకున్నాడు. దాన్ని కొరుకుతూ నమిలేయడానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఆ పాము ముఖం మీద అనేకసార్లు కాటేసింది. దీంతో రమా పామును తీసుకెళ్లి ఓ చెట్టు కింద వదిలేశాడు. 

కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కు వెళ్లమని కుటుంబ సభ్యులు చెప్పినా పట్టించుకోలేదు. అది పిల్ల పామమని, అది కాటేస్తే ఏం కాదని చెప్పి.. నేరుగా తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. అయితే, సోమవారం ఉదయానికి రమా చనిపోయి కనిపించాడు. ఇటీవల ఔరంగబాద్ పోలీసులు మేకను హత్య చేశాడనే కారణంతో ఓ మహేంద్రదాస్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో అతడు మేక మెడను మెలేశాడు. దీంతో అది చనిపోయింది. ఆ మేక యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: బతికున్న పామును కరకరా నమిలేస్తూ.. ఈ యువకుడిది హైదరాబాదేనా..  

Also Read: అది దెయ్యమేనా? కెమేరాకు చిక్కిన వింత ఆకారం.. నాగపూర్ ప్రజల్లో గుబులు!

Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?

Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!

Continues below advertisement
Sponsored Links by Taboola