దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమీ తన యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది. షియోమీ తన స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్‌ తేదీని ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం ఈ ఈవెంట్ ఆగస్టు 26వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి కంపెనీ టీజర్ విడుదల చేసింది. షియోమీ నుంచి మరో కొత్త టీవీ, నోట్‌బుక్ ఇండియాలో విడుదల కానున్నాయనే విషయాన్ని టీజర్ ద్వారా చెప్పకనే చెప్పింది. షియోమీ IoT ఉత్పత్తులను కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఏయే ఉత్పత్తులను తీసుకురానుందనే విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. 






మీడియాకు ఈమెయిల్స్..
షియోమీ తన స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్‌ని ప్రకటిస్తూ మీడియాకు ఈమెయిల్స్ పంపింది. 'ద ఫ్యూచర్ ఈస్ స్మార్ట్' అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ప్రోగ్రామ్ జరగనున్నట్లు తెలిపింది. ఈ ఈవెంట్‌కు యూజర్లు రిజిస్టర్ చేసుకునేందుకు షియోమీ Mi.comలో ఒక ప్రత్యేక పేజీని క్రియేట్ చేసింది.


నోట్‌బుక్ ల్యాప్‌టాప్.. 
ఇటీవల బ్యాక్‌లిట్ కీబోర్డ్‌తో ఎంఐ నోట్‌బుక్ ల్యాప్‌టాప్ విడుదల కానున్నట్లు షియోమీ ప్రకటించిన విషయం తెలిసిందే. కంపెనీ టీజర్‌‌లో ఉన్న ఒక చిన్న ప్రశ్న ఎంఐ నోట్‌బుక్ విడుదలను సూచిస్తున్నట్లుగా ఉంది. ఈ ఎంఐ నోట్‌బుక్ మోడల్ వెబ్‌క్యామ్‌తో రానుంది. ఇంతకుముందు షియోమీ నుంచి వచ్చిన మోడల్స్‌లో ఈ ఫీచర్ లేదు. 


Also Read: Redmi Laptop: ప్రొఫెషనల్స్ కోసం రెడ్ మీ బుక్ ప్రో….స్టూడెంట్స్ కోసం రెడ్ మీ బుక్ ఈ-లెర్నింగ్… రెడ్ మీ నుంచి భారత మార్కెట్లోకి తొలి ల్యాప్ టాప్


ఇదే విషయానికి సంబంధించి షియోమీ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రఘురెడ్డి సైతం టీజర్ విడుదల చేశారు. దీనిని బట్టి చూస్తే ఎంఐ నోట్‌బుక్‌లో టీయూవీ ఎల్‌బీఎల్ ప్రొటెక్షన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది డీసీ డిమ్మింగ్ సపోర్ట్‌తో రానుంది.





స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్ ప్రకటన ట్వీట్‌ను ఎంఐ టీవీ ఇండియా రీట్వీట్ చేసింది. అలాగే షియోమీ కూడా సంథింగ్ బిగ్ అంటూ ఒక టీజర్ విడుదల చేసింది. ఈ రెండింటి బట్టి అంచనా వేస్తే ఈ ఈవెంట్‌లో ఎంఐ లార్జ్ స్క్రీన్ టీవీ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. 






అదిరిపోయే ఫీచర్స్‌తో ఎంఐ 4C టీవీ
ఎంఐ నుంచి బడ్జెట్ రేంజ్‌లో ఎల్ఈడీ టీవీ 4సీ (Mi LED TV 4C) స్మార్ట్ టీవీ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో 32 అంగుళాలు డిస్‌ప్లే ఉండనుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత ప్యాచ్‌వాల్ యూఐ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనుంది. దీని ధర రూ.15,999గా నిర్ణయించింది. ఇది బ్లాక్ కలర్ ఆప్షన్లో లభిస్తుంది. దీనిని ఎంఐ ఇండియా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.  


Read More: Mi LED TV 4C: అదిరిపోయే ఫీచర్స్‌తో ఎంఐ 4C టీవీ వచ్చేసింది.. ధర చూస్తే ఎగిరి గంతేస్తారు...


Also Read: Xiaomi Smartphone Shipments: క్యూ 2 అమ్మకాల్లో దూసుకుపోయిన షియోమీ..