NEET UG 2021 Exam Update: దేశ వ్యాప్తంగా మెడికల్‌ కాలేజీలలో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET 2021 Exam) పరీక్ష వాయిదా పిటిషన్లపై సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. నీట్ యూజీ 2021 పరీక్షను రద్దు చేయడంగానీ లేదా రీ షెడ్యూల్ చేయడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నీట్ ఎగ్జామ్ రీ షెడ్యూల్‌ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సోమవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. 


రీషెడ్యూల్ చేయడం సరైన నిర్ణయం కాదని, నీట్ వాయిదా వేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే పరీక్ష నిర్వహిస్తారని స్పష్టం చేసింది. సెప్టెంబర్‌ 12న నీట్ 2021 పరీక్ష జరుగుతుందని కొన్ని రోజుల కిందట అధికారులు పేర్కొన్నారు. అదే రోజు సీబీఎస్ఈ లేదా ఇతర పరీక్షలు ఉన్నాయని కొందరు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏదో ఒక పరీక్షను ఎంచుకోవాల్సి ఉంటుందని, కరోనా విపత్కర పరిస్థితుల్లో నీట్ ఎగ్జామ్ ను కొందరి కోసం రీషెడ్యూల్ చేయడం సరైన నిర్ణయం కాదని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయ పడింది. 


Also Read: NEET UG 2021: నీట్ యూజీ పరీక్షలు వాయిదా వేయబోం.. క్లారిటీ ఇచ్చిన అధికారులు


ఒకవేళ మీకు ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు ఒకే రోజు షెడ్యూల్ అయినట్లయితే.. వాటిలో మీకు అత్యంత ప్రాధాన్యం ఉన్న పరీక్షలకు హాజరు కావాలని సూచించింది. ఎందుకంటే ఇది కేవలం ఒక్క శాతం అభ్యర్థులకు సంబంధించిన సమస్య కనుక మిగతా 99 శాతం విద్యార్థులకు అసౌకర్యాన్ని కలిగించడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. బోర్డులు తమకు సంబంధించిన పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటాయని, అందులో తాము జోక్యం చేసుకోవడం లేదన్నారు. కాగా, ఈసారి నీట్ పరీక్షను 13 భాషల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. 
Also Read: TS Academic Calendar: తెలంగాణలో 2021-22 విద్యా సంవత్సరం ఖరారు.. దసరా, సంక్రాంతి సెలవులు ఎప్పుడంటే..? 


NEET 2021 Admit Card డౌన్‌లోడ్ చేసుకునే విధానం..



  • మొదట అధికారిక వెబ్‌సైట్ https://neet.nta.nic.in/ లో లాగిన్ అవ్వాలి

  • నీట్ యూజీ అడ్మిట్ కార్డ్ లింక్ (NEET UG admit card link) మీద క్లిక్ చేయాలి

  • పుట్టిన తేదీ, అప్లికేషన్ నెంబర్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాలి

  • సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి

  • మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది

  • హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకుని, ప్రింటౌట్ తీసుకోండి. ఎగ్జామ్ హాలుకు ఈ అడ్మిట్ కార్డును మీతో పాటు తీసుకెళ్లాలి.


Also Read: TS CPGET 2021: 18 నుంచి సీపీజీఈటీ పరీక్షలు.. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ స్టార్ట్ ఎప్పుడంటే?