తెలంగాణలోని ఏడు వర్సిటీల పరిధిలో పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీపీజీఈటీ (కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్) - 2021 పరీక్షలను ఈ నెల 18 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్ పాండు రంగారెడ్డి వెల్లడించారు. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం మూడు సెషన్లుగా పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 వరకు.. మూడో సెషన్ సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు ఉంటుందని వివరించారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను.. ఈ నెల 14 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చిన అభ్యర్థులకు సూచించారు. 


సీట్ల సంఖ్య 40 వేలకు చేరింది..
ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కొత్తగా 7000 సీట్లు పెరగడంతో మొత్తం పీజీ కోర్సుల్లో సీట్ల సంఖ్య 40 వేలకు చేరిందని కన్వీనర్‌ తెలిపారు. సీపీజీఈటీ పరీక్ష దరఖాస్తు గడువు ఆగస్టు 28తో ముగిసిందని.. ఇప్పటివరకు 75 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ నెల 12 వరకు ఉందని చెప్పారు. అపరాధ రుసుము రూ.500తో ఈ నెల 6 వరకు, రూ.2,000 రుసుముతో 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కాగా, హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌, పరీక్షల షెడ్యూల్ సహా మరిన్ని వివరాల కోసం ఈ కింది వెబ్ సైట్లను సంప్రదించవచ్చు. 


వెబ్‌సైట్ల వివరాలు..
www.osmania.ac.in
http://ouadmissions.com/ 
http://www.tscpget.com/  


ఏయే వర్సిటీల్లో చేరవచ్చు?
సీపీజీఈటీ పరీక్ష ద్వారా ఉస్మానియా యూనివర్సిటీతో పాటు శాతవాహన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీలతో పాటు వాటి అనుబంధ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు. 
ఏయే కోర్సుల్లో చేరవచ్చు?
సీపీజీఈటీ పరీక్ష ద్వారా ఎంకామ్, ఎంఏ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా కోర్సులలో చేరవచ్చు. వీటితో పాటు 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సుల్లోనూ ప్రవేశాలు పొందవచ్చు. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్ అండ్ సోషల్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ విభాగాల్లో పలు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 


Also Read: TS LAWCET Results: తెలంగాణ లాసెట్, ఐసెట్‌, పీజీఈసెట్ ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే?


Also Read: Central Varsities Jobs:సెంట్రల్ యూనివర్సిటీల్లో 6,229 జాబ్స్.. 10 లోగా నోటిఫికేషన్.. కేంద్ర మంత్రి వెల్లడి