ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, బాలికల రక్షణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన మృగాళ్ల చేష్టలు ఆగడంలేదు. ప్రభుత్వం దిశ చట్టం తీసుకువచ్చినా కామాంధుల ఆగడాలు ఆగడంలేదు. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట అత్యాచారం వెలుగులోకి వస్తూనే ఉంది. కృష్ణా జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికకు మాయమాటలు చెప్పి పశువుల సావిడికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. అనంతరం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను తీసుకెళ్లి వాళ్ల ఇంటి ముందు పడేసిపారిపోయారు. చిరిగిన బట్టలతో ఉన్న కుమార్తెను చూసి తల్లిదండ్రులు విషయం ఆరా తీశారు. వెంటనే బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తక్షణమే స్పందించిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Viral Video: నెల్లూరులో వియ్యంకుల మధ్య వివాదం... ఇటుకలతో దాడి... వైరల్ గా మారిన దృశ్యాలు


సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం!


ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలతో ఇద్దరు నైజీరియన్లను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. యువతిపై దారుణానికి ఒడిగట్టినట్లు రెండు రోజుల కిందట ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. శుక్రవారం ఆ కేసులో అబుజి ఉబాకా, టోనీలను నిందితులుగా గుర్తించామన్నారు. తనపై అత్యాచారం జరిగిందని బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. నైజీరియా రాయబార కార్యాలయానికి అరెస్టు సమాచారాన్ని పంపామని పోలీసులు వెల్లడించారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. 


అదనపు కట్నం కోసం వేధింపులు 


ధనదాహంతో కట్టుకున్న భార్యను వేధించడం మొదలు పెట్టాడో ప్రబుద్ధుడు. రూ.కోటిన్నర కట్నం తీసుకుని ఇంకా అదనపు కట్నం కావాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. అందుకు అంగీకరించలేదని సొంత భార్య ప్రైవేట్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బ్లాక్‌ మెయిల్‌కు దిగాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఈ అమానుష ఘటన జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్డు నెం. 11లో నివసిస్తున్న ఓ మహిళ(24) 2016లో ఎంబీఏ పూర్తి చేసి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశారు. ఆ సమయంలోనే ఆమెకు సికింద్రాబాద్‌లోని గన్‌రాక్‌ ఎన్‌క్లేవ్‌కు చెందిన మహ్మద్‌ ఫర్హాన్‌(26)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. 2017లో వీరి వివాహం అయ్యింది. 


Also Read: Warangal Chit Fund: భార్యాభర్తలపై పెట్రోల్ పోసి నిప్పు, సెల్‌ఫోన్ షాప్‌పై కూడా.. దంపతుల నిర్వాకం


కోటిన్నర కట్నం


వివాహం సమయంలో మహిళ తండ్రి రూ. కోటిన్నర కట్నంగా ఇచ్చారు. కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత అత్తింటి వారి అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టారు. బెదిరింపులకు పాల్పడడం మొదలుపెట్టారు. అప్పటితో ఆగకుండా భార్యతో ఏకాంతంగా ఉన్నప్పుడు దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడాతనంటూ భర్త బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. దీంతో వేధింపులు తట్టుకోలేని బాధిత మహిళ గురువారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె భర్తతోపాటు అత్తమామలు ఆయేషా ఉస్మాన్‌, మహ్మద్‌ ఒస్మాన్‌లపై వరకట్నం, వేధింపులు కేసులు నమోదుచేశారు.


 


Also Read: Pawan kalyan: పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం... పాఠశాల విద్యార్థులతో జెండా పట్టించి, నినాదాలు... వీడియోలు వైరల్