పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం తల్లాపురం ప్రాథమిక పాఠశాలలో పవన్ కల్యాణ్ పుట్టినరోజు నాడు పుస్తకాల పంపిణీ చేశారు. ఇప్పుడు ఆ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. స్కూల్ లో జరిగిన ఈ వేడుకల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. పాఠశాల విద్యార్థులతో జనసేన జెండా పట్టించి, పిల్లలతో నినాదాలు చేయించడంపై ఎంఈవో విచారణ చేపట్టారు.


వైసీపీ నేతలకు నిబంధనలు వర్తించవా?


ఈ నెల 2వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు పవన్ అభిమానులు. విద్యార్థులతో హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ అని నినాదాలు చేయించారు. ఈ విషయంపై ఫిర్యాదు రావటంతో ఎంఈవో విచారణ చేపట్టారు. అయితే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి నిబంధనలు వైసీపీ నేతలకు ఎందుకు వర్తించడంలేదని నిలదీశారు. 


Also Read: TN Assembly on Pawan Kalyan: పవన్ కల్యాణ్ ట్వీట్ పై తమిళనాడు అసెంబ్లీలో చర్చ... అధికారంలోకి రావడానికే రాజకీయం, వచ్చాక కాదు..


జెండా స్థూపం విషయంలోనూ...


జిల్లాలో ఇటీవల జనసేన పార్టీ జెండా స్థూపం నిర్మాణం విషయం ఉద్రిక్తతకు దారితీసింది. నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో జనసేన పార్టీ జెండా స్థూపం నిర్మాణాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలు కావాలనే అడ్డుకుంటున్నారని జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజున ఈ స్థూపం ప్రారంభించాలని జనసేన నేతలు భావించారు. కానీ పోలీసుల చర్యతో ఆటంకం ఏర్పడింది.


కాటకూటేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జనసేన జెండా స్థూపం నిర్మించేందుకు ఆ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. కానీ అందుకు అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ అధికారులు జనసేన జెండా స్థూపం నిర్మాణాన్ని నిలిపివేశారు. అధికార పార్టీ నాయకుల అండతో జనసేన జెండా స్థూపాన్ని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలో దిగారని జనసేన కార్యకర్తలు ఆందోళన చేశారు. నియోజకవర్గంలో వైసీపీ పార్టీ జెండా స్థూపాలకి ఎలా అనుమతులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.


Also Read: RRR Update: ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ పూర్తైందని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు..మరి తారక్-చెర్రీకి జక్కన్న ఎందుకు కబురుపెట్టినట్టు..