యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ ''ఆర్.ఆర్.ఆర్''. ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ పూర్తైదని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కేక్ కట్ చేసి సంబరాలు కూడా చేసుకున్నారు రాజమౌళి అండ్ టీమ్. దీంతో హమ్మయ్య ఎట్టకేలకు తమ అభిమాన హీరోలు షూటింగ్ పూర్తిచేసుకున్నారు ఇక తదుపరి ప్రాజెక్టులపై దృష్టిసారిస్తారని భావించారు. కానీ ఇంతలోనే జక్కన్న మళ్లీ చెక్కుదాం అంటున్నాడట. కొన్ని సీన్స్ రీషూట్ కోసం తారన్-చెర్రీని మళ్లీ సెట్స్ మీదకి పిలుస్తున్నాడని టాక్.
పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ లో బిజీగా ఉన్న జక్కన్న… 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో ఇప్పటికే తెరకెక్కించిన కొన్ని కీలక సన్నివేశాలు మరింత పర్ ఫెక్ట్ గా తీయాలని భావిస్తున్నాడట. అందుకే కనీసం ఓ నాలుగైదు రోజులు షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల కొత్త ప్రాజెక్టులతో బిజీ అయిపోకముందే వీటి షూట్ కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారట. వాస్తవానికి రాజమౌళి ఇప్పటి వరకూ ఎప్పుడూ చెప్పిన సమయానికి షూటింగ్ పూర్తిచేయలేదు. ముందుగా నిర్ణయించిన సమయానికి సినిమా విడుదల చేయలేదు. అయితే 'ఆర్ ఆర్ ఆర్' మాత్రం కరోనా కారణంగా ఆలస్యమైందుకున్నారు. కానీ ఇంతలోనే మళ్లీ చిత్రీకరణ ప్లాన్ చేశాడనే వార్త విని ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానులు మరింత లేట్ అవుతుందేమో అని డిస్సప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే అనుకున్న సమయం కన్నా ఎక్కువ టైం తీసుకుంటే అది తారక్ - చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్టులపై పడుతుందన్నది వారి భావన.
Also Read: షారుఖ్ ఖాన్ తో నయనతార, ప్రియమణి..ఎట్టకేలకు బాలీవుడ్ లో అడుగుపెట్టిన లేడీ సూపర్ స్టార్
ఈ సినిమాలో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఆలియా భట్ - ఒలివియా మోరిస్ వీరికి జోడీగా కనిపించనున్నారు. అజయ్ దేవగన్ , సముద్రఖని, శ్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డి.వి.వి.దానయ్య నిర్మాత, కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' ప్రకటించిన తేదీకే రావడం లేదని ఇప్పటికే స్పష్టమైంది. మరి అక్టోబర్ 13న రాకపోతే తదుపరి విడుదల తేదీని ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని వేచి చూస్తున్నారు. ఇప్పటికే 2022 సంక్రాంతికి కానుకగా జనవరి 8న 'RRR' సినిమా వచ్చే అవకాశం ఉందని కొందరు, సమ్మర్ కానుకగా వస్తుందని మరికొందరు చెబుతున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇంతకీ ఇద్దరు హీరోలను పిలిచింది ప్యాచ్ వర్కుల కోసమా…మరికొన్ని కీలక సన్నివేశాల రీ షూట్ కోసమా అన్నది తెలియాల్సి ఉంది.
Also Read: ప్రకాశ్ రాజ్ ‘మా’ ప్యానెల్ ఇదే..వాళ్లిద్దర్నీ కూడా కలిపేసుకున్నారు..
Also Read: భీమ్లా నాయక్ పాటపై వివాదం.. ఐపీఎస్ అధికారి ఆగ్రహం, మా సేవలను మరిచిపోయారు!
Also Read: ‘మా’లో విందు రాజకీయాలు.. నరేష్ మెసేజ్ వైరల్!