విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో తెలుగు రాష్ట్రాలు వెనుకబడిపోతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సంలో దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలలో తెలంగాణ రెండు శాతం కూడా సాధించలేదు. ఆంద్రప్రదేశ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దేశంలోకి వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐలలో ఏపీకి వచ్చింది 0.14 శాతమే. కేంద్రం విడుదల చేసిన ఈ లెక్కలు తెలుగు రాష్ట్రాలు పారిశ్రామిక వెనుకబడిపోతున్నాయన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి.
Also Read : యూపీలో మళ్లీ యోగికే చాన్స్
గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి రూ.4,42,568.84 కోట్ల విదేశీ పెట్టబడులు..!
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ఇండియాలోకి మాత్రం పెట్టుబడుల వరద పారిందని చెప్పుకోవచ్చు. ఏడాదిలో భారత్‌లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టబుడుల విలువ రూ. రూ.4,42,568.84 కోట్లు. 2020లో అత్యధిక ఎఫ్‌డీఐలు అందుకున్న ప్రపంచ దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉంది. ఓ రకంగా కరోనా భారత్‌కు మేలు చేసింది. ప్రపంచవ్యాప్త తయారీ రంగం చైనాలో కేంద్రీకృతం అయింది. కరోనా పరిస్థితుల తర్వాత ఒక్క చోటే ఉండకూడదన్న లక్ష్యంతో ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలు ఇతర దేశాల వైపు చూస్తున్నాయి. చవకగా లభించే మానవవనరులు ఇతర అనుకూలతలు ఉండటంతో భారత్ వైపు ఎక్కువ మంది పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు.
Also Read : నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపై ఏబీపీ-సీఓటర్ సర్వే ఫలితాలు
గుజరాత్‌కే వెళ్లిపోతున్న పెట్టబుడులు..!
దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అత్యధికం ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌కు వెళ్లిపోతున్నాయి. వచ్చిన రూ.4,42,568.84 కోట్ల పెట్టుబడుల్లో గుజరాత్‌కు 36.79 శాతం అంటే రూ. 1 లక్షా 62వేల 830కోట్లు గుజరాత్‌లోనే పెట్టుబడులుగా పెట్టారు. తర్వాతి స్థానం మహారాష్ట్రది ఆ రాష్ట్రం కూడా దాదాపుగా రూ. 1 లక్షా ఇరవై వేల కోట్ల పెట్టుబడులను సాధించింది. ఇక పారిశ్రామిక పరంగా ఎంతో అభివృద్ధి చెందిన కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే వీరికి వస్తున్న పెట్టుబడులు తక్కువే. తొలి స్థానంలో గుజరాత్‌కు . 1 లక్షా 62వేల 830కోట్లు పెట్టుబడులుగా వస్తే ఐదో స్థానంలో ఉన్న తమిళనాడుకు వచ్చింది రూ.17,208కోట్లు మాత్రమే.
Also Read : వ్యాక్సిన్ వేయించుకున్న వారికే మద్యం అమ్మకం
తెలంగాణకు కాస్త ఊరట..!
తెలుగురాష్ట్రాల వైపు పెట్టుబడిదారులెవరూ పెద్దగా చూడటం లేదు. పెద్ద ఎత్తున పరిశ్రమల్ని ఆకర్షిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నవేవీ లెక్కల్లో కనిపించడం లేదు. గత ఆర్థిక సంవత్సంలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు కేవలం రూ. 8617కోట్లు. దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఇది రెండు శాతం కూడా లేదు. రాష్ట్రాల వారీగా చూస్తే మొత్తంగా ఏడో స్థానంలో నిలిచింది. ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ మెరుగైన పరిస్థితులోనే ఉందనుకోవాలి. ఎందుకంటే తెలంగాణ కంటే తక్కువగా పదకొండు రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించాయి. అయితే హైదరాబాద్ లాంటి అతి పెద్ద పారిశ్రామి, వాణిజ్య, వ్యాపార కేంద్రం ఉన్న తెలంగాణకు ఆశించినట్లుగా పెట్టుబడులు రాలేదన్నది వ్యాపార నిపుణుల అంచనా.
ఏపీ పరిస్థితి దారుణం..!
ఒకప్పుడు కియా లాంటి అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించి ప్రపంచ వ్యాపార రంగాన్ని తన వైపు తిప్పుకున్న ఆంధ్రప్రదేశ్ వైపు ఇప్పుడు పెట్టుబడిదారులెవరూ చూడటం లేదు. దేశంలో అతి తక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సాధించిన రాష్ట్రాల్లో ఏపీ కింద నుంచి నాలుగో స్థానంలో ఉంది. ఏపీ కంటే అధ్వానంగా ఉన్న రాష్ట్రాలు బీహార్, ఒడిశా, గోవా మాత్రమే. గత ఏడాది దేశంలోకి వచ్చిన రూ.4,42,568.84 కోట్ల పెట్టుబడుల్లో ఏపీకి వచ్చింది రూ.638 కోట్లు మాత్రమే. ఇది ఒక శాతం కూడా కాదు. 0.14 శాతం మాత్రమే. శుక్రవారం పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేస్తూ సీఎం జగన్ రూ. 30వేల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. కానీ అలాంటి పరిస్థితి లేదని కేంద్రం విడుదల చేసిన నివేదికలో వెల్లడయింది.
పెట్టుబడులొస్తేనే ఉపాధి, అభివృద్ది..!
ఏ రాష్ట్రం అయినా పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రధానంగా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఒక్క సారి పెట్టుబడి వస్తే దీర్ఖకాలంగా ప్రభుత్వానికి లబ్ది ఉంటుంది. అక్కడి ప్రజలకు ఉద్యోగాలు లభిస్తాయి. ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వానికి పన్నుల ఆదాయం ఉంటుంది. అంతకు మించి ఆ పరిశ్రమ వల్ల అనుబంధ పరిశ్రమలూ వస్తాయి. ఒక్క పెట్టుబడి పెద్ద ఎత్తున ప్రజల జీవితాల్లో మార్పు తెస్తుంది. ఈ పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాలే అభివృద్దిలోనూ ముందుకెళ్తాయి. గుజరాతే దీనికి ఉదాహరణ.
Also Read : యాపిల్ కారు మేడిన్ టొయోటా