నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ పరీక్షలపై అధికారులు స్పష్టత ఇచ్చారు. నీట్ యూజీ పరీక్షలను వాయిదా వేయబోమని స్పష్టం చేశారు. యూజీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12వ తేదీనే జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డీజీ వినీత్ జోషి మాట్లాడుతూ.. నీట్, సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఒకేసారి జరిగి క్లాష్ అయ్యే అవకాశం లేదని అన్నారు. కాబట్టి ముందుగా నిర్ణయించిన తేదీనే (సెప్టెంబర్ 12) పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఈసారి నీట్ పరీక్షను 13 భాషల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా 198 ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. 
పరీక్షలు వాయిదా వేయండి ప్లీజ్.. 
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలకు ఏటా నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా పలు మార్లు వాయిదా పడింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబర్​ 12వ తేదీన ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను సైతం ప్రారంభించింది. అయితే వచ్చే నెలలో పలు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో నీట్ యూజీ పరీక్షకు హాజరుకాలేమని.. దయచేసి పరీక్ష తేదీ మార్చాలని పలువురు విద్యార్థులు ట్విట్టర్ ద్వారా కేంద్రాన్ని కోరారు. దీంతో పోస్ట్ పోన్ నీట్ యూజీ 2021 హ్యాష్ ట్యాగ్ (#PostponeNEETUG 2021 ) ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ నేపథ్యంలో నీట్ యూజీ పరీక్షలు వాయిదా వేసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ.. ఎన్టీఏ అధికారులు 
కాంగ్రెస్ నేతల ట్వీట్.. 
నీట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు ట్వీట్ చేశారు. పరీక్షలు వాయిదా వేయమని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం తగదని పేర్కొన్నారు.