యంగ్ హీరో నాగచైతన్యతో ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన పూజా హెగ్డే.. అల్లు అర్జున్ ‘డీజే’ సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు సినిమాల్లో కాస్త పద్ధతిగా కనిపించిన పూజా... డీజేలో హాట్ హాట్ గా కనిపించి వరుస ఆఫర్లు పట్టేసింది. ‘రంగస్థం’లో ఐటెంసాంగ్ చేసిన ఈ బ్యూటీ ‘అరవింద సమేత’ సినిమాతో హిట్ కొట్టి అప్పటి వరకూ తనపై ఉన్న ఐరెన్ లెగ్ హీరోయిన్ ముద్రను పూర్తిగా చెరిపేసుకోవడమే కాదు.. గోల్డెన్ లెగ్ బ్యూటీగా మారిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో కలసి నటించిన మహేశ్ మహర్షి, అల్లు అర్జున్ ‘అలా వైకుఠపురంలో’తో తిరుగులేని హిట్టందుకుంది. టాలీవుడ్‌లో టాప్ 3 స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఉన్నవన్నీ క్రేజీ ప్రాజెక్టులే. ఓ వైపు రామ్ చరణ్ తో ఆచార్యలో నటిస్తోన్న పూజా.. తాజాగా పవన్ కళ్యాణ్ సరసన నటించేందుకు కూడా ఆఫర్ కొట్టేసింది. అంతేకాదు.. అల్లు అర్జున్‌తో మూడోసారి జతకట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 


Also Read: శ్రీదేవి సోడా సెంటర్‌ రివ్యూ: సీసా పాతదే.. సరుకే కొత్తది!


హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ చేస్తోన్న సినిమాలో బుట్టబొమ్మే హీరోయిన్. ఇందులోనే మరో హీరోయిన్ గా ప్రియమణి నటించనుంది టాక్. పూజా హెగ్డే గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే, ‘గద్దలకొండ గణేష్’ సినిమాల్లో నటించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హరీశ్ శంకర్ మూవీలో నటిస్తోంది. ఈ మూవీకి ‘ఇపుడే మొదలైంది’,‘సంచారి’ అనే టైటిళ్లు వినిపిస్తున్నాయి. వీటిలో ఏ టైటిల్ ఫైనల్ అన్నది సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ ‘గబ్బర్‌ సింగ్‌’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. లేటెస్ట్ మూవీలో  పవన్ కళ్యాణ్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నట్టు సమాచారం. 


Also Read: ‘వివాహ భోజనంబు’ రివ్యూ.. కరోనాకు కామెడీ ట్రీట్మెంట్


ఇక పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ ‘భీమ్లానాయక్’తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్‌తో  ‘హరి హర వీరమల్లు’లో నటిస్తున్నాడు. ‘అయ్యప్పునుమ్ కోషియం’లో నిత్యామీనన్, ‘హరిహరవీరమల్లు’లో  నిధి అగర్వాల్‌, హరీశ్ శంకర్ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్స్. అంటే మూడు ప్రాజెక్టుల్లోనూ ఇదివరకు నటించని ముద్దుగుమ్మలతోనే పవర్ స్టార్ రొమాన్స్ చేస్తున్నాడన్నమాట.  


Also Read: ఇచ్చట వాహనములు నిలుపరాదు రివ్యూ: సుశాంత్‌కు హ్యాట్రిక్ మిస్?


ALso Read: దసరాకి థియేటర్లలో మహాసముద్రం..గన్ తో ఒకర్నొకరు బెదిరించుకుంటున్న శర్వానంద్-సిద్దార్థ్


Also read: రక్తంతో తడిసిన కత్తి.. బ్లాక్ కలర్ లాంగ్ కోట్.. నాగార్జున-ప్రవీణ్ సత్తారు మూవీ ఫస్ట్ లుక్ ఓ రేంజ్‌లో ఉంది