Maha Samudram Release Date:దసరాకి థియేటర్లలో మహాసముద్రం..గన్ తో ఒకర్నొకరు బెదిరించుకుంటున్న శర్వానంద్-సిద్దార్థ్

విమర్శలకుల ప్రశంసలు అందుకునేలా నటించే హీరో శర్వానంద్...బొమ్మరిల్లు మూవీతో తెలుగుప్రేక్షకులకకు బాగా కనెక్టైన హీరో సిద్దార్థ్. వీరిద్దరూ కలసి నటించిన ''మహాసముద్రం'' దసరా బరిలో దిగేందుకు సిద్ధమైంది.

Continues below advertisement

RX 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా మహాసముద్రం. 
యంగ్ హీరో శర్వానంద్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న ఈ మూవీలో అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దసరా కానుకగా మహాసముద్రం అక్టోబరు 14న థయేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 

Continues below advertisement

Also Read: రక్తంతో తడిసిన కత్తి.. బ్లాక్ కలర్ లాంగ్ కోట్.. నాగార్జున-ప్రవీణ్ సత్తారు మూవీ ఫస్ట్ లుక్ ఓ రేంజ్‌లో ఉంది

ఈ మూవికి సంబంధించి రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ గ్లిమ్స్ భలే ఆసక్తిగా ఉంది. శర్వానంద్ - సిద్ధార్థ్ ఇద్దరూ ఒకరికొకరు తుపాకులు గురిపెట్టుకొని ఉండగా.. హీరోయిన్ అదితి రావు హైదరి అలల మధ్య ఎంజాయ్ చేస్తోంది.  లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన మహాసముద్రం మూవీకి సంబంధించి ఇప్పటివరకూ విడుదలైన పోస్టర్స్, 'హే రంభా' సాంగ్ బాగానే ఉందనిపించింది.  AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై  సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమాకి చైతన్య భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్నాడు.  జగపతి బాబు - రావు రమేష్ - గరుడ రామ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: ‘మా అమ్మ నాన్న లేచిపోయి పెళ్లి చేసుకున్నారు.. అందుకే మళ్లీ పెళ్లి చేశా: టీవీ నటి అమ్ములు

అయితే అప్పుడెప్పుడో ఎన్టీఆర్ బాద్ షా మూవీ తర్వాత సిద్దార్థ్ టాలీవుడ్ లో నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ రూ. 10.5 కోట్లకు తీసుకుందని సమాచారం. అదే నిజమైనతే శర్వానంద్ - సిద్దార్థ్ కెరీర్ లో ఇది అతిపెద్ద డిజిటల్ డీల్ అని చెప్పొచ్చు. సాధారణంగా శర్వానంద్ నటనకు వంకపెట్టే ఛాన్సివ్వడు... సిద్దార్థ్ కూడా ఎంపిక చేసుకున్న ప్రాజెక్టులు సరైన కాకపోయిన ఉండొచ్చు కానీ నటన పరంగా నెగిటివ్ మార్క్స్ పెద్దగా లేవు. మరి  విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'మహాసముద్రం' లో ప్రేక్షకులు ఈదగలరో లేదో చూడాలి.

Also Read:బుల్లెట్ బండి.. భలే దూసుకెళ్తోంది, ఇంతకీ ఎవరీ మోహన భోగరాజు?

Also Read: గ్లామర్ డోసు పెంచిన అవికా గోర్.. బోల్డ్ సీన్స్‌లో రాహుల్ రామకృష్ణ

Also Read: ‘వివాహ భోజనంబు’ మూవీ ఆన్‌లైన్‌లో లీక్.. సందీప్‌కు షాకిచ్చిన తమిళ్ రాకర్స్

Continues below advertisement