‘‘ఇరుక్కుపో... హత్తుకోని వీరా వీరా... కొరుక్కుపో... నీ తనివితీరా తీరా’’ అని హస్కీగా కవ్వించింది.
‘‘ఓ బావా మా అక్కను సక్కగ సూస్తావా’’ అని మురిపించింది
‘‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ?’’ అని మహిళ గొప్పతానాన్ని గొంతులో పలికించింది.
‘‘ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి’’ అంటూ పాటకు ప్రాణం పోసింది.
‘‘హైలో హైలెస్సోరే.. హరిదాసులు వచ్చారే’’ అంటూ గొంతులోనే పండుగ వాతావరణం తీసుకొచ్చింది.
‘‘ఎన్ని కన్నీళ్ల ఉసురిదీ వెంటాడుతున్నది’’ అని జీవిత సత్యాన్ని స్వరాలతో సాక్షాత్కరించింది.
‘‘భాగమతీ అంటూ ఒళ్లు గొగొర్పొడిచేలా గంభీరంగా ఆలపించింది.
ఇంకా రంగస్థంలో జిగేలు రాణి, సోగ్గాడే చిన్ననాయనలో ‘‘డిక్క డిక్క డుం డుం’’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ స్వరంలోంచి జాలువారిన ప్రతి పాటా సూపర్ హిట్టే. కానీ, ఇప్పుడీమె గురించే ఎక్కువ సెర్చ్ జరుగుతోంది. ఎందుకంటే అంతా బుల్లెట్ బండి పాట మహిమ. ‘'నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా...డుగ్గు డుగ్గు డుగ్గు అని’' ఇప్పుడెక్కడ విన్నా ఇదే పాట మార్మోగిపోతోంది. ఈ పాటకు అట్రాక్ట్ కాని యువత లేరంటే ఆశ్చర్యపోవాల్సిందే. వేడుకల్లో, ఆటోల్లో, కార్లలో ఎక్కడ చూసినా ఇదే పాటే ఊపేస్తోంది. ఈ పాట ఇప్పుడే కొత్తగా వచ్చిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ పాట వచ్చి చాలారోజులైంది. ఇప్పుడెందుకు వైరల్ అవుతోందంటే అందుకు కారణం సాయిశ్రీయ అనే అమ్మాయి. తన పెళ్లి బరాత్‌లో ఈ పాటకు ఆమె చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటి నుంచీ బుల్లెట్టు బండి సాంగ్ దూసుకుపోతోంది.
ఆ పాటలో తెలంగాణ జీవం ఉంది, యాస ఉంది, సగటు పెళ్ళికూతురు హృదయం ఉంది, తన ఆశల-ఆకాంక్షల పల్లకీ అది అందుకే అంతలా కనెక్టయింది. లక్ష్మణ్ కలం నుంచి జాలువారిన ఈ పాటకు ఎస్‌కే బాజి సంగీతం అందించగా, తెలంగాణ స్లాంగ్‌లో అద్భుతంగా ఆలపించింది మోహనా భోగరాజు. ఆమె ఎంత అందంగా ఉందో అంతే అందంగా ఈ పాట పాడింది. అయితే ఈ పాట పాడింది ఆమేనని ఇప్పటికి చాలా మందికి తెలియదు. ‘బుల్లెట్ బండి’సాంగ్ వైరల్ అయ్యాక ఈ పాట పాడింది ఎవరు? గతంలో ఏ పాటలు పాడిందనే చర్చ మొదలైంది.
హైదరాబాద్ అమ్మాయే..
మోహన భోగరాజు పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. ఆమె తల్లికి సంగీతమంటే ఎంతో ఇష్టం. అమ్మపాటలు వింటూ పెరిగిన మోహనకు కూడా సంగీతంపై మక్కువ పెరిగింది. ఎక్కడ సంగీతం పోటీలు జరిగినా వెళ్లి పాల్గొనేది. బుల్లితెరలో ప్రసారమయ్యే పలు పాటల పోటీల్లో పాల్గొన్నా..చాలాసార్లు ఫెయిలైంది. అయినప్పటికీ ఎక్కడా తగ్గలేదు..ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అలా ఒకసారి ఓ పెద్ద కాంపిటీషన్ వెళ్లిన మోహన వాయిస్‌ని మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ విని ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘జైశ్రీరామ్’లో అవకాశం ఇప్పించాడు. అందులో ‘సయ్యామమాసం మనదేలే’అనే పాటను పాడింది మోహననే. ఈ పాట పాడిన తరువాత కూడా ఆమె పలు సినిమాలకు కోరస్ గానే పాడింది.
బాహుబలిలో ‘మనోహరి’ సాంగ్ తో తిరిగిన దశ
అరవింద సమేతలో ‘రెడ్డమ్మ తల్లి’ పాట నచ్చనివారుంటారా...
ఇంతకీ బుల్లెట్ బండి ఎలా పుట్టిందంటే..
ఊరూ వాడా మారుమోగిపోతోన్న బుల్లెట్ బండి పాట ఎలా పుట్టిందో ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది మోహన. పెళ్లీడుకొచ్చి ఓ యువతి మనోభావాలను పాట రూపంలో చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటుందట. ఆమె ఎక్కడ పుట్టింది? ఎలా పెరిగింది? ఆమె నేపథ్యం ఏంటి? తాను పెళ్లి చేసుకునే యువకుడికి వివరించాలనేది తన కాన్సెప్ట్. తన ఆలోచనకు తగినట్లుగా లక్ష్మణ్ మంచి లిరిక్స్ అందించాడు. అందుకే మోహన ఈ పాటను వెంటనే ఒప్పేసుకొని ఆస్వాదిస్తూ పాడిందట. అందుకే ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితం పొందింది.
Also Read: బుల్లెట్టు బండి పాటకి టీఆర్ఎస్ ఎంపీ కవిత దరువు.. ఆమె స్టెప్పులకు ఆశ్చర్యపోయిన జనం, వీడియో వైరల్
Also Watch:
Also Read: వ్యాపారం మొదలుపెట్టిన కీర్తి సురేష్.. మహానటి ప్లానింగ్ అదుర్స్!
Also Read: షూటింగ్ మొదలెట్టిన ''బంగార్రాజు'', ఈ సారి కూడా సంక్రాంతి బరిలో దిగడం ఫిక్సా..!