అఫ్గానిస్థాన్ సంక్షోభం సహా అక్కడి ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. విదేశాంగ శాఖ మంత్రి జయ్ శంకర్ అధ్యక్షతన పార్లమెంట్ ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది. అఫ్గాన్‌లో పరిణామాలు, భారత పౌరుల తరలింపు తదితర అంశాలపై అఖిలపక్ష నేతలకు జయ్ శంకర్ వివరించారు.
Also Read:Chittoor News: రాత్రికి రాత్రి పెళ్లి పందిరి నుంచి వధువు పరారీ
ఎవరెవరు పాల్గొన్నారు?
అఫ్గానిస్థాన్ లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్, విదేశాంగ కార్యదర్శి హర్ష ష్రింగ్లా ఈ భేటీకి హాజరయ్యారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, పియూష్ గోయల్ పాల్గొన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ తరఫున మల్లికార్జున ఖర్గే, ఆనంద్‌శర్మ, అధీర్ రంజన్ చౌదురీ, ఎన్సీపీ తరఫున శరద్‌పవార్, జేడీఎస్ నుంచి మాజీ ప్రధాని దేవెగౌడ హాజరయ్యారు.
అఫ్గాన్ లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అక్కడి పౌరులు, జర్నలిస్టులపై తాలిబన్లు దాడులు చేస్తున్నారు. తాజాగా టోలో న్యూస్ రిపోర్టర్ పై తాలిబన్లు దాడి చేయడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
Also Read: Afghanistan Crisis: అఫ్గాన్ లో రెచ్చిపోతున్న తాలిబన్లు.. రిపోర్టర్ పై విచక్షణారహితంగా దాడి