`మహానటి` చిత్రంతో నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత వరుసగా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం `సర్కార్ వారి పాట`లో నటిస్తోంది. పవన్ కళ్యాణ్‌తో నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా ఫ్లాప్ కావడంతో.. స్టార్ హీరోతో ఛాన్స్ దక్కించుకునేందుకు కీర్తికి కాస్త సమయం పట్టింది. మొదటసారిగా ఆమెకు మహేశ్ బాబుతో నటించే అవకాశం దక్కింది. ప్రస్తుతం ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు చిరంజి చిత్రం ‘భోళాశంకర్’లోను అమ్మడు ఛాన్స్ కొట్టేసింది. అయితే, ఇందులో  చిరంజీవికి చెల్లిగా నటించనుంది. ఈ ఉత్సాహంలో ఉన్న మహానటి వ్యాపారం మొదలెట్టింది.


‘భూమిత్ర’ పేరుతో స్కిన్ కేర్ బ్రాండ్‌ను కీర్తి లాంచ్ చేసింది. తన విదేశీ భాగస్వాములతో కలిసి కీర్తి ఇలా వ్యాపారవేత్తగా మారుతోంది. నిజానికి కీర్తి ఇంతకుముందే అమెరికాలో తన బంధువుల భాగస్వామ్యంతో బిజినెస్‌లో ప్రవేశించానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. క్రేజ్ ఉన్నప్పుడే వ్యాపార రంగంలోనూ నిలదొక్కుకోవాలనే ఆలోచనతో  స్కిన్ కేర్ ఉత్పత్తుల బ్రాండ్‌ను కీర్తి ప్రారంభించినట్లు తెలుస్తోంది. తన మిత్రులు శిల్పారెడ్డి, కాంతిదత్‌తో కలిసి భూమిత్ర బ్రాండ్‌ పేరుతో స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. దీనిపై కీర్తి మాట్లాడుతూ.. ప్రకృతి సిద్ధమైన ఔషధాలతో సౌందర్యాన్ని మెరుగుపరిచే విధంగా స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నట్లు చెప్పింది. 


Also Red: హ్యాపీ బర్త్ డే ప్రియదర్శి.. కెమెరా మ్యాన్ అవ్వాలనుకుని నటుడయ్యాడు, సీనియర్‌తో పెళ్లి!


ఇప్పటికే సన్నీలియోన్ స్కిన్ కేర్ ఉత్పత్తులు సౌందర్య సాధనాల ఉత్పత్తుల వ్యాపారంలో దూసుకుపోతోంది. అలాగే కత్రిన `కె` పేరుతో సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాల్ని నిర్వహిస్తోంది. టాలీవుడ్ లో సమంత స్కూల్స్ కాస్ట్యూమ్స్ బిజినెస్ లు సహా రకరకాల వ్యాపారాలతో బిజీ అయిపోయింది. రకుల్ ప్రీత్ జిమ్‌ల నిర్వహణ వ్యాపారంతో ఆర్జిస్తోంది. ఉపాసన సహా పలువురు పాపులర్ సెలబ్రిటీలు వాణిజ్యవేత్తలుగా వెలుగుతున్నారు. ఇప్పుడు అదే బాటలో కీర్తి సురేష్ కూడా ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తోంది డాటరాఫ్ మేనక. 


ఇక మూవీ ప్రాజెక్టుల విషయానికొస్తే... అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ రోజు భోళాశంకర్ టైటిల్ ని ప్రకటించడమే గాక.. చిరు-కీర్తి మధ్య అనుబంధాన్ని గుర్తు చేసేలా ఓ పోస్టర్ ని మెహర్ రమేష్ టీమ్ ఆవిష్కరించారు. వేదాళం రీమేక్ `భోళా శంకర్`లో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ ఫైనల్ అయ్యిందని అధికారికంగా ప్రకటించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అనీల్ సుంకర- రామబ్రహ్మం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Also Read: 'మా' ఎన్నికల తేదీ ఖరారు.. పంతం నెగ్గించుకున్న చిరంజీవి


Also Read: షూటింగ్ మొదలెట్టిన ''బంగార్రాజు'', ఈ సారి కూడా సంక్రాంతి బరిలో దిగడం ఫిక్సా..!


Also Read: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు.. ఎవరెవరు లిస్టులో ఉన్నారంటే..


‘Also Read: బిగ్‌బాస్-5’ బిగ్ అప్‌డేట్: క్వారంటైన్‌లో కంటెస్టెంట్లు.. టెలికాస్ట్ తేదీ ఇదేనా?


Also Read: మెగాస్టార్‌తో మెహర్ రమేష్.. ఈ ఫ్లాప్ చిత్రాల దర్శకుడు ఈసారైనా హిట్ కొడతాడా?