మెహర్ రమేష్.. ఈ పేరు చెప్తేనే నిర్మాతలు భయపడుతుంటారు. హీరోలు వద్దులే అనుకుంటారు. అలాంటి దర్శకుడికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పటికే సినీప్రియులు చాలామందికి మింగుడుపడడం లేదు. ఎందుకంటే  మెహర్ రమేష్ పేరు చెబితే చాలా మందికి తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అతిపెద్ద ప్లాప్ చిత్రాలు మదిలో మెదులుతాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన కంత్రి, బిల్లా, శక్తి వల్ల నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లోనూ 2013లో వెంకటేష్ హీరోగా చేసిన 'షాడో' కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఆ తర్వాతి నుంచి మెహర్ రమేష్‌‌కు అవకాశాలు తగ్గిపోయాయి. ఇలాంటి దర్శకుడికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రిస్క్ చేస్తున్నారంటూ అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. 


తమిళ్ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈమూవీకి ఇప్పటికే 'భోళా శంకర్' అనే టైటిల్ ఖరారు చేశారు. తమిళ వెర్షన్ లో అజిత్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగు రీమేక్ కి మొదట పవన్ కళ్యాణ్ అనుున్నారు. ఆ తర్వాత చిరంజీవి అని క్లారిటీ వచ్చింది.  దర్శకుడిగా కూడా మొదట “సాహో” దర్శకుడు సుజిత్ అనుకున్నా... సడెన్ గా  మెహర్ రమేష్ ఎంట్రీ ఇచ్చాడు. వాస్తవానికి ఇది మెహర్ రమేష్‌కి మెగా ఆఫర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకూ తెలుగులో తెరెక్కించిన మూవీస్ అన్నీ డిజాస్టర్స్‌గా మిగిలినా.. చిరు ఛాన్సిచ్చాడంటే గ్రేట్ అంటున్నారు మెగాభిమానులు. అయితే.. ఆల్రెడీ హిట్టైన కథనే మళ్లీ తెరకెక్కించడం ఊరట కలిగించే విషయం. అయితే.. చిరు మానియా కలిసొస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కనీసం ఈ మూవీతో అయినా మెహర్ రమేష్‌కి లక్ కలిసొచ్చి కెరీర్ టర్న్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ట్రైలర్.. పాపం అదొక్కటే తక్కువట, ఆ 4 అక్షరాలతో తంట!


Also Read: మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్.. కొడుకు కోసం రాత్రికి రాత్రే..


ఇక భోళా శంకర్ సినిమా విషయానికొస్తే చిరంజీవి 66వ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ మోషన్  పోస్టర్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు విడుదల చేశాడు.  ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాత. ఈ మూవీలో చిరు విభిన్నమైన లుక్‌ల.. అంటే గుండుతో కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో చిరు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఒరిజినల్ వేదాళంలో అజిత్‌కు చెల్లి పాత్రలో లక్ష్మీ మీనన్ నటించింది. ఆ పాత్రకు మంచి గుర్తింపు రావడంతో తెలుగులో ఆ క్యారెక్టర్ కు కీర్తి సురేష్‌ను తీసుకున్నారు.


Also Read: చిక్కుల్లో హీరోయిన్ సంజన, రాగిణి.. డ్రగ్స్ కేసులో కీలక ఆధారాలు


Also Read: చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’లో సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్? తెలుగులో తొలిసారిగా..


Also Read: టాలీవుడ్‌లో ‘మెగా’ సందడి.. వరుస చిత్రాలతో చిరు ప్రభంజనం.. ఫ్యాన్స్‌కు పూనకాలే!


Also Read: చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో అల్లు అర్జున్ ఎక్కడా? బన్నీయే మెగాస్టార్ అంటూ చిరు ఫ్యామిలీలో ఆర్జీవి చిచ్చు