మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఓ రేంజ్ లో జరిగాయి. రాఖీ పండగ - చిరు బర్త్ డే రెండూ ఒకేసారి రావడంతో మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి.  మెగా ఫ్యామిలీ సభ్యులంతా చిరంజీవి ఇంట్లో చేరి పెద్ద పండుగే చేసుకున్నారు. మెగా బ్రదర్స్ కు రాఖీ కట్టిన ఆడపడుచులు వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలానే బిగ్ బాస్ తో కేక్ కట్ చేయించి బర్త్ డే ని సెలబ్రేట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముగ్గురు మొనగాళ్లతో పాటూ మెగా ఫ్యామిలీ హీరోలందర్నీ ఒకే దగ్గర చూసి అభిమానులు ఆనందానికి హద్దే లేదు. అయితే ఈ వేడుకల్లో ఎక్కడా అల్లు అర్జున్ కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. 


చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో... పవన్ కల్యాణ్, నాగబాబు, రామ్ చరణ్ - ఉపాసన, సుస్మిత, శ్రీజ, విష్ణు, కళ్యాణ్ దేవ్, చెల్లెల్లు, మనవరాళ్లు, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక దంపతులు, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ సహా చిరు బావమరిది అల్లు అరవింద్ కూడా సతీసమేతంగా హాజరయ్యాడు. కన్నుల పండువగా జరిగిన ఈ వేడుకల్లో ఎక్కడా బన్నీ ఫ్యామిలీ మాత్రం కనిపించలేదు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్.. వేడుకలకు ఎందుకు డుమ్మా కొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో పలు సందర్భాల్లో మెగా ఫ్యామిలీ అని కాకుండా.. అల్లు ఫ్యామిలీ అనుకునేలా బన్నీ వ్యవహరిస్తున్నాడనే చర్చలు జరిగాయి. 


Also Read: దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్


Also read: క్లాస్, మాస్... పాటేదైనా మాధుర్యాన్ని పంచే సింగర్ 'గీతామాధురి'కి జన్మదిన శుభాకాంక్షలు


అల్లు అర్జున్ 'పుష్ప' షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లనే మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు వెళ్లలేదంటున్నారు అభిమానులు. ఆదివారం ఉదయాన్నే చిరుకు స్వయంగా విషెస్ అందించి షూటింగ్‌కి వెళ్లాడని చెబుతున్నారు.  కనీసం భార్య స్నేహారెడ్డి అయినా ఈ వేడుకల్లో కనిపించాలి కదా అని మరో ప్రశ్న లేవనెత్తారు నెటిజన్లు. మరోవైపు ఏ చిన్న అవకాశం దొరికినా వాడేసుకోవాలని చూసే రామ్ గోపాల్ వర్మ.. మరోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. ఒరిజనల్ మెగస్టార్ చిరంజీవి తర్వాత.. అల్లు అర్జున్ ఒక్కడే రియల్ మెగాస్టార్ అని పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ సహా ఇతర మెగా హీరోలందరూ పరాన్నజీవులు అన్నట్లుగా ట్వీట్లు చేశాడు.  


‘‘చిరంజీవి కుమారులు మేనల్లుళ్లు, మేనకోడళ్లు, మేనమామలు బంధువుల కంటే.. హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడైన అల్లు అర్జున్ మాత్రమే నిజమైన సక్సెస్’’ అని ఆర్జీవి మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు.  చిరంజీవి వేడుకలకు హాజరు కాకపోవడం అల్లు అర్జున్ తెలివైన నిర్ణయమని, అతను సెల్ఫ్ మేడ్ స్టార్ అని తెలిపాడు. ‘‘చిరంజీవి విజయాన్ని అనుభవిస్తున్న పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - వరుణ్ తేజ్ - సాయి ధరమ్ తేజ్ మొదలైన కుటుంబ పరాన్నజీవులలో అల్లు అర్జున్ చేరకూడదు'' అని వర్మ మరో వివాదాస్పద ట్వీట్స్ చేశాడు. ఆర్జీవీ వరుస ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ - అల్లు ఫ్యామిలీ వేర్వేరు అన్నట్లుగా వర్మ చేసిన ట్వీట్లపై మెగా అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.


Also Read: ఫ్యామిలీ హీరో ఇంత భయంకరంగా మారాడా... ప్రభాస్ సలార్ మూవీలో జగ్గుభాయ్ లుక్ చూశారా..!


Also Read: ఇచ్చట వాహనాలు నిలుపరాదు ట్రైలర్.. ఏరియాకు కొత్తయితే కొట్టేస్తారా?


Also read: చడీచప్పుడు లేకుండా నిశ్చితార్థం చేసుకున్న RX100 హీరో కార్తికేయ, ఫొటోలు వైరల్