తెలుగు ఇండస్ట్రీలో వారసుల హవాసాగుతోంది. మెగా కుటుంబం నుంచి దాదాపు క్రికెట్ టీం బరిలో ఉంది. మిగిలిన కుటుంబాల నుంచి కూడా వారసులు ఇండస్ట్రీలో సత్తాచాటుకుంటున్నారు. ఇప్పుడు మరో వారసుడు కూడా ఇండస్ట్రీకి వస్తున్నాడు. దిల్ రాజు సోదరుడైన శిరీష్ తనయుడు ఆశీష్ రెడ్డిని హీరోగా పరిచయం చేయబోతున్నాడు ఈ నిర్మాత. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి ‘రౌడీ బాయ్స్’ అనే టైటిల్ ఖరారు చేశారు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా ప్రమోషన్ ని ఆ మధ్య ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ వేడుకలో చేశారు. అయితే కరోనా కారణంగా సినిమా మళ్లీ వాయిదా పడింది. చిన్న సినిమానే అయినా దిల్ రాజు మార్క్ ప్రమోషన్ సాగుతోంది. ఈ సందర్భంగా దర్శకులు వీవీ వినాయక్ ఫస్ట్ లుక్, సుకుమార్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
Read Also: ఆగస్టు ఆఖరివారంలో థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే
‘‘హీరోగా చాలామంది వస్తారు. కానీ సక్సెస్ కావడం కష్టం. ఇది ఆశిష్‌కు బిగ్ టార్గెట్. ఎంత జడ్జ్‌మెంట్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు పాస్ మార్కులు వేసేంతవరకు టెన్షన్ పడతాం. ఆశిష్‌ను లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఈ సినిమాకు కాస్త ఎక్కువ టెన్షన్ పడుతున్నాం’’ అన్నారు నిర్మాత దిల్ రాజు. ‘‘హీరోగా సక్సెస్ కాకపోతే మరో ఆప్షన్ పెట్టుకోవాలని ఆశిష్‌ను ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను. కానీ ఆశిష్ డ్యాన్స్, ఎనర్జీ లెవల్స్ బాగుంటాయి. సక్సెస్ అవుతాడనే నమ్మకం ఉంది. ఆశిష్‌తోపాటు లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ ఇందులో నటించాడు. వాళ్లిద్దరూ అనుపమతో పోటీపడి నటించారు’’ అని తెలిపారు.
Also Read: ఫ్యామిలీ హీరో ఇంత భయంకరంగా మారాడా... ప్రభాస్ సలార్ మూవీలో జగ్గుభాయ్ లుక్ చూశారా..!
ఒకవేళ ఫెయిల్ అయితే ఆశిష్ దేనికైనా ప్రిపేర్డ్‌గా ఉండాలని దిల్ రాజు చెబుతున్నాడు కానీ ఆశిష్‌కు ఏ ఆప్షన్స్ అవసరం లేదని.. కొన్ని సీన్స్ చూశా బాగా చేశాడనిపించిందన్నారు వినాయక్. రొమాంటిక్ సీన్స్ అదుర్స్ అన్నాడు మరో దర్శకుడు సుకుమార్. తనని హీరోగా చూడాలనుకున్న అనిత ( దిల్ రాజు మొదటి భార్య) ఇప్పుడు లేరని.. తనని హీరోగా గుర్తించిన ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అన్నాడు ఆశిష్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు లక్ష్మణ్, లగడపాటి శ్రీధర్, శిరీష్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ పాల్గొన్నారు. హర్ష దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ‘రౌడీ బాయ్స్’అక్టోబరులో విడుదల కానుంది.
Also Read: ఇచ్చట వాహనాలు నిలుపరాదు ట్రైలర్.. ఏరియాకు కొత్తయితే కొట్టేస్తారా?
Also read: చడీచప్పుడు లేకుండా నిశ్చితార్థం చేసుకున్న RX100 హీరో కార్తికేయ, ఫొటోలు వైరల్